Wednesday, October 30, 2024
HomeతెలంగాణSathupalli: సీతారామ టన్నెల్ త్వరగా పూర్తి చేయండి

Sathupalli: సీతారామ టన్నెల్ త్వరగా పూర్తి చేయండి

సత్తుపల్లి మండలం యాతాలకుంట గ్రామంలో సీతారామ ప్రాజెక్టు పనులను ఖమ్మం జిల్లా కలెక్టర్ వీ.పీ. గౌతమ్ తో కలిసి పరిశీలించారు సత్తుపల్లి శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్య. ఈ సందర్భంగా పనుల్లో జాప్యం కారణంగా కలెక్టర్ అధికారులపై మండిపడ్డారు. గతంలో పరిశీలించిన క్రమంలో ఇప్పటికీ పురోగతి లేదని, వాతావరణ పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవాలని సూచించారు. సాధ్యసాధ్యాలను పరిశీలనలోకి తీసుకుని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అటవీ శాఖ, రెవెన్యూ శాఖల సమన్వయంతో ముందుకు పోవాలని, ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే తమకు తెలపాలని సూచించారు. అనంతరం కిష్టారం-చెరుకుపల్లి మధ్యలోని సత్తెమ్మతల్లి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ ఆవరణలో భక్తుల సౌకర్యార్థం ఇటీవల షెడ్ నిర్మించాలని ఆలయ కమిటీ పనులను ప్రారంభించింది. ఈ క్రమంలో నిర్మించిన నాలుగు పిల్లర్లను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన విషయాన్ని ఆలయ కమిటీ కలెక్టర్ దృష్టి కి తెచ్చారు.ఈ విషయమై ఎంపీడీవో చిట్యాల సుభాషిణితో మాట్లాడి పరిష్కరించాలని సూచించారు. అదేవిధంగా చెరుకుపల్లి లో R&R సమీపంలోని తుమ్మల నగర్ లో నివాసం ఉంటున్న వారి సమస్యలు తెలుసుకుని నివేదికను తనకు అందజేయాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News