ములుగు జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి కలెక్టర్ చొరవ చూపాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ- సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ములుగు జిల్లా కలెక్టర్ గా ఇలా త్రిపాఠి పదవీ బాధ్యతలు తీసుకున్న అనంతరం హైదరాబాదులో మంత్రి సత్యవతి రాథోడ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి ఇలా త్రిపాఠి శుభాకాంక్షలు తెలిపి మాట్లాడుతూ ఉద్యోగ విధుల నిర్వహణలో ప్రజల మెప్పు పొందాలని, జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. కలెక్టర్ వెంట ఆమె భర్త భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భువనేష్ మిశ్రా పాల్గొనగా రెండు జిల్లాల్లో నెలకొన్న సమస్యలపై చర్చించారు.
Sathyavathi Rathod: సమస్యల పరిష్కారంలో చొరవ చూపండి
ములుగు జిల్లా కలెక్టర్ గా ఇలా త్రిపాఠి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES