Sunday, October 6, 2024
HomeతెలంగాణSathyavathi Rathod: ఆశ్రమ స్కూళ్లు, గురుకుల విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి

Sathyavathi Rathod: ఆశ్రమ స్కూళ్లు, గురుకుల విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి

కార్యాచరణతో తక్షణం సిద్ధం కావాలంటూ మంత్రి ఆదేశాలు

ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆశ్రమ స్కూళ్లు,గురుకులాల్లో చదివే విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌ అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది వర్షాలు అధికంగా కురుస్తున్న నేపథ్యంలో గురుకుల విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, నాణ్యమైన ఆహారం, నీరు అందజేయాలన్నారు. మంగళవారం రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్ లో గిరిజన సంక్షేమ శాఖ కార్యకలాపాలపై గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తు, ప్రత్యేక కార్యదర్శి శ్రీధర్, అదనపు కార్యదర్శులు సర్వేశ్వర్ రెడ్డి,గురుకుల విద్యాసంస్థ‌ల సొసైటీ కార్య‌ద‌ర్శి న‌వీన్ నికోల‌స్ లతో మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్షించారు.ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ సమాజంలో వెనుకబడిన గిరిజన ప్రజలకు మేలు చేసేలా అధికారులు ప్రభుత్వ పథకాలను క్షేత్రస్ధాయిలో పటిష్టంగా అమలు చేయాలని అన్నారు.విద్య,వైద్య సౌకర్యాలతో పాటు ఆర్ధికంగా సామాజికంగా ఎదిగేలా కృషి చేయాలన్నారు.గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉన్న వివిధ విద్యా సంస్ధల ద్వారా లక్షల్లో విద్యార్ధులు చదువుకుంటున్నారని, వారికి నాణ్యమైన విద్య అందేలా చర్యలు చేపట్టాలన్నారు.ఈ ఏడాది భారీ వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు బారిన పడకుండా గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.గురుకుల విద్యాలయాల్లో ఫీవర్ సర్వేలు నిర్వహించాలని, అవరమైతే వైద్య శిబిరాలు నిర్వహించాలని తెలిపారు.అంతే కాకుండా మరుగుదొడ్లు, భోజనశాలలు, వంట గదుల్లో పారిశుధ్యం మెరుగ్గా ఉండేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. వరదల కారణంగా గురుకుల విద్యాలయాల్లో ఎక్కడైనా సమస్యలు ఉంటే యుద్ధ ప్రాతిపదికన వాటి పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని అన్నారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు సమకూర్చాలని సూచించారు. సీఎం ఎస్టీ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ డెవలప్ మెంట్ ద్వారా గిరిజనులలో ఉన్న స్కిల్స్ ను ఐడెంటిఫై చేసి వారిలో ఉన్న ప్రతిభను మెరుగుపరచి, ఆర్థికంగా మరింత మేలు జరిగేలా చూడాలన్నారు. గిరివికాస పథకాన్ని పటిష్ఠంగా అమలు చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆదేశించారు. అందుకు తక్షణమే కార్యాచరణ రూపొందించాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా మెడికల్‌ క్యాంప్‌లు నిర్వహించాలని తెలిపారు.గిరిపోషణతో పాటు,కేసీఆర్‌ న్యూట్రిషన్‌, బాలామృతం ఆదివాసీలకు అందించాలని మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News