Friday, September 20, 2024
HomeతెలంగాణSatish Kumar: గ్రామాల అభివృద్ధే సీఎం లక్ష్యం

Satish Kumar: గ్రామాల అభివృద్ధే సీఎం లక్ష్యం

పనిచేసే బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి

తెలంగాణ పల్లెల్లో అభివృద్ధి కుసుమాలు విరబూస్తున్నాయి. ఏండ్లతరబడి నిరాదరణకు గురైన గ్రామాలు నేడు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయి. మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యం తెలంగాణ రాష్టంలో సిద్ధిస్తోంది. గ్రామీణ తెలంగాణలో మౌళిక వసతుల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసి గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుందని హస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. సైదాపూర్ మండలంలో ఈరోజు 10 కోట్ల42లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కార్యక్రమాలలో ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ పాల్గొన్నారు. మండల కేంద్రంలో రూ.25 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. వెంకటేశ్వర్ల పల్లి గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి మరియు రూ.5 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు, సర్వాయిపేట గ్రామంలో రూ.17.52 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన అనంతరం రూ.5 లక్షల వ్యయంతో నిర్మించనున్న కురుమ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సైదాపూర్ మండలం ఘనపూర్ జడ్పీ రోడ్ నుండి రాయికల్ తండా, వయా నల్లానితండా వరకు రూ 2.80 కోట్ల వ్యయంతో బీటి రోడ్ పనులకు శంకుస్థాపన చేశారు, ఎలబోతారం ఆర్ అండ్ బి రోడ్డు నుండి అమ్మనగుర్తి వరకు బి టి రోడ్డు రెన్యువల్ కు 5 కోట్ల 70 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేశారు, సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామంలో బొమ్మకల్ నుండి వంగర వరకు రూ 29.50 లక్షల వ్యయంతో బీటి రోడ్ రెన్యువల్ పనులకు ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేశారు, మండలంలోని నల్ల రామయ్య పల్లి లో 20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న గ్రామపంచాయతీ భవనానికి భూమిపూజ అలాగే ఎలబోతారం గ్రామంలో 20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న గ్రామపంచాయతీ భవనానికి భూమి పూజ చేశారు, ఎక్లాస్ పూర్ గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి కేటాయించిన స్థలంలో ఆర్టీసీ స్థలం ఉందని అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే ప్రత్యేక చొరవ తీసుకోని రికార్డ్ లను పరిశీలించి ఆర్టీసీ అధికారులతో మాట్లాడి స్థలాన్ని గ్రామపంచాయతీ భవనానికి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ…
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని గ్రామలలో సీసీ రోడ్లు, మురికి కాలువలు, మరుగు దొడ్లను ప్రభుత్వం నిర్మిస్తోందని ప్రతి గ్రామ అభివృద్ధికి నెల నెలా ప్రభుత్వం నిధులు ఇస్తుందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలోనే ఉన్నాయని తెలిపారు. వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు గ్రామాలలో సామాజిక భవనాలు, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పౌరునికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పల్లెలు ఎంతో వెనుకబాటులో ఉండేవని, స్వరాష్టం సాధించిన తర్వాత బంగారు తెలంగాణ లక్ష్యం గా సాగుతున్న కేసీఆర్ పాలనలో తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధిని సాధిస్తున్నాయని, నాటి సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో ఎంతో వెనుకబాటుకు గురయ్యామని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి గ్రామీణ ప్రాంతాలే పట్టుకొమ్మలని, ప్రజలంతా కలిసికట్టుగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News