డా.వై.యస్.ఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం పరిధిలో ఆయుర్వేద మెడిసిన్ ( బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేద మెడిసిన్ అండ్ సర్జరీ ) పరీక్ష ఫలితాల్లో వరంగల్ కాకతీయ యూనివర్సిటీ ప్రాంతానికి చెందిన విద్యార్థిని పాశికంటి సౌమ్యశ్రీ యూనివర్సిటీ టాపర్ గా నిలిచారు.ఆమె తల్లిదండ్రులు పాశికంటి రమాదేవి,శ్రీనివాస్ ల ప్రోత్సాహంతోనే పతకాలు బహుమతులు పొందటం జరిగిందని సౌమ్యశ్రీ శుక్రవారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు.వివరాల్లోకి వెళ్తే..సౌమ్య శ్రీ వరంగల్ హన్మకొండ అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద విద్యా కళాశాలలో 2015-2016 సంవత్సరంలో (బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేద మెడిసన్ అండ్ సర్జరీ) విద్యలో చేరింది.ఫిబ్రవరి 6వ తేదిన డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం 26వ స్నాతకోత్సవం అట్టహాసంగా నిర్వహించడం జరిగింది.విజయవాడలోని వెన్యూ కల్యాణ మండపంలో ప్రతిభ చూపి రెండు తెలుగు రాష్ట్రాల నుండి స్టేట్ టాపర్ గా నిలిచినందుకు విద్యార్థిని డాక్టర్.పాశికంటి సౌమ్య శ్రీ కి బిఏఎంఎస్ ఆయుర్వేదిక్ మెడిసిన్ లో ఒక బంగారు పతకం,రెండు వెండి పతకాలు బహుమతులు రావటం జరిగింది.ఈ స్వర్ణ పతకాలను యూనివర్సిటీ ఛాన్స్ లర్, రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ అందజేశారు.తన తల్లిదండ్రుల,కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే తాను యూనివర్సిటీ స్థాయిలో టాప్ ర్యాంక్, బహుమతులు,పతకాలు సాధించగలిగానని సౌమ్యశ్రీ తెలిపారు.డాక్టర్ పాశికంటి సౌమ్యశ్రీ విద్యనభ్యసిస్తున్న సమయంలో ప్రసూతి స్త్రీ రోగ చికిత్స,శల్య చికిత్సలో రెండు బంగారు పతకాలు సాధించినట్లు తెలిపారు.ప్రసూతి స్త్రీ రోగ చికిత్సలో పీజీ చేసి మహిళలకు మంచి వైద్య సేవలను అందించాలని తమ కోరిక ఉన్నట్లు తెలిపారు.రానున్న రోజుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు.
చాలా సంతోషంగా ఉంది:
- సౌమ్యశ్రీ తల్లిదండ్రులు,పి.రమాదేవి,శ్రీనివాస్..
మా కూతురు డా.పాశికంటి సౌమ్యశ్రీ కి ఆయుర్వేద మెడిసిన్ అండ్ సర్జరీ చదవాలని చిన్నప్పటి నుండి ఎంతో కోరికగా ఉండేది.తన కోరిక మేరకు పట్టుదలతో చదువుతూ వచ్చింది.ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పట్టుదల విడువలేదు.తన కష్టానికి ప్రతిఫలం లభించింది.రానున్న రోజుల్లో మరింత ఉన్నతమైన స్థాయికి ఎదిగి నిరుపేదలకు అండగా ఉండాలని మస్ఫూర్తిగా కోరుకుంటున్నాము..మా కూతురు సౌమ్యశ్రీ కి పతకాలు, బహుమతులు రావటంతో కుటుంబ సభ్యులు కూడ ఎంతో సంతోషంగా ఉన్నారు.