78వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా అత్యంత ఘనంగా జరిగాయి. కోఠిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయంలో కూడా గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎస్‌బిఐ హైదరాబాద్ సర్కిల్ సీజీఎం రాజేష్ కుమార్ జాతీయ జెండాను ఎగురవేసి మువ్వెన్నల జెండాకు గౌరవ వందనం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలో సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులు చురుగ్గా పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎస్‌బిఐ సిబ్బంది నేతృత్వంలో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరిగాయి.
ఉద్యోగుల పిల్లలు దేశభక్తి గీతాలు ఆలపిస్తూ సంప్రదాయ నృత్యాలు చేశారు. క్రీడలు, నృత్యం, విద్యతో పాటు పలు రంగాల్లో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని, వార్డు సభ్యులకు సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్‌బిఐ లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్ రష్మీ సిన్హా, జనరల్ మేనేజర్ ఎన్ డబ్ల్యు 2 ప్రకాష్ చంద్ర బారోర్, జనరల్ మేనేజర్ఎన్ డబ్ల్యు 1 రవి కుమార్ వర్మ, డిప్యూటీ జనరల్ మేనేజర్‌లు, ఇతర సీనియర్ మేనేజ్‌మెంట్ అధికారులు పాల్గొన్నారు.