Saturday, November 23, 2024
HomeతెలంగాణSC: రిజర్వేషన్ అమలులో సింగరేణి భేష్

SC: రిజర్వేషన్ అమలులో సింగరేణి భేష్

సింగరేణి సంస్థ ఎస్సీ ఉద్యోగుల‌ రిజర్వేషన్ అమలులో, ప‌దోన్న‌తులు, సంక్షేమం వంటి అన్ని విషయాల్లోనూ నిబంధనల కన్నా మించి అమ‌లు జ‌రుపుతూ  ఇత‌ర కంపెనీలకు ఆదర్శప్రాయంగా నిలుస్తోంద‌ని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు సుభాష్ పార్థీ ప్రశంసలు కురిపించారు. హైద‌రాబాద్ సింగ‌రేణి భ‌వ‌న్ లో ఆయన సింగరేణి సంస్థ కంపెనీలో అమలు జరుపుతున్న ఎస్సీ రూల్ ఆఫ్ రిజర్వేషన్,  ప‌దోన్న‌తులు త‌దిత‌ర అంశాల‌పై సింగరేణి ఉన్నతాధికారులతో సమీక్ష  స‌మావేశం  నిర్వహించారు. సంస్థ ఛైర్మ‌న్‌, సి అండ్ ఎండీ ఎన్. శ్రీధర్. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా సంస్థ డైరెక్టర్ (ఫైనాన్స్ మరియు పా) ఎన్.బలరామ్‌ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలను తెలియజేశారు. అనంతరం జాతీయ కమిషన్ సభ్యులు సుభాష్ పార్థీ మాట్లాడుతూ… దేశంలో చాలా పరిశ్రమల్లో నిర్దేశిత ఎస్సీ రిజర్వేషన్ 15 శాతం కన్నా తక్కువ అమలు జ‌ర‌ప‌డం చూస్తుంటామని కానీ సింగరేణిలో 17 నుండి 20% అమలు జరగడం అభినందనీయమన్నారు. అంబేద్కర్ జయంతి రోజును సెలవు దినంగా ప్రకటించడమే గాక అన్ని ఏరియాల్లో ఉత్సవాలు నిర్వహించుకోవడం కోసం ఒక్కొక్క ఏరియాకు 60 వేల రూపాయలు మంజూరు చేయడం ప్రశంసనీయమన్నారు. దీనిని లక్ష రూపాయలకు పెంచాలని ఎస్సీ ఉద్యోగుల సంఘాలు కోరుతున్నాయని దీని పట్ల సానుకూలంగా స్పందించాలని కోరారు. సంస్థ చైర్మన్ అండ్ ఎండి ఎన్.శ్రీధర్ ఈసందర్భంగా మాట్లాడుతూ… సింగరేణి సంస్థ ఎస్సీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని, ఎస్సీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఒక చీఫ్ లైజ‌న్‌ ఆఫీసర్ తో పాటు ప్రతి ఏరియాలో ఏరియా ఆఫీసర్లను నియమించామ‌న్నారు. అలాగే వారికి కావాల్సిన‌ కార్యాలయాలు కూడా సమకూర్చామ‌ని, ఎస్సీ ఉద్యోగుల సమస్యల పట్ల పూర్తి సానుకూలంగా కంపెనీ ఉంటుందని తెలిపారు.

- Advertisement -

ఈ సమావేశంలో జాతీయ ఎస్సీ క‌మిష‌న్ హైద‌రాబాద్ రీజియ‌న్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ సునీల్ కుమార్ బాబు, ప్రైవేట్ సెక్ర‌ట‌రీ న‌వీన్ రోహిలా, డైరెక్టర్ (ఆపరేషన్) ఎన్‌.వి.కె. శ్రీనివాస్, డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) జి.వెంకటేశ్వర్ రెడ్డి, జీఎం(కో ఆర్డినేష‌న్‌) శ్రీ ఎం.సురేశ్‌, జీఎం (ప‌ర్స‌న‌ల్‌) వెల్ఫేర్‌, రిక్రూట్‌మెంట్ కె.బ‌స‌వ‌య్య‌, జీఎం (ప‌ర్స‌న‌ల్‌), ఐఆర్‌, పీఎం, ఈఈ అండ్ సీఎస్ఆర్ కుమార్ రెడ్డి,  జీఎం ఆర్జీ-1, చీఫ్ లైజ‌న్ ఆఫీస‌ర్ కె.నారాయ‌ణ‌, జీఎం మ‌ణుగూరు డి.రాంచంద‌ర్‌, ఎస్వో టూ డైరెక్ట‌ర్‌(పీపీ) ఎన్‌.సుధాక‌ర్ రావు,  ఏజీఎం(ప‌ర్స‌న‌ల్‌) దీక్షితులు, డీజీఎంలు శ్రీ‌నివాస్‌, అజ‌య్ కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News