Sunday, November 24, 2024
HomeతెలంగాణSCR GM Arun Kumar Jain: సత్యనిష్ట నిజాయితీలే జాతికి సౌభాగ్యం

SCR GM Arun Kumar Jain: సత్యనిష్ట నిజాయితీలే జాతికి సౌభాగ్యం

వాకథాన్ తో..

దక్షిణ మధ్య రైల్వే నిఘా అవగాహన వారోత్సవంలో భాగంగా నెక్లెస్ రోడ్డు రైల్వే స్టేషన్ ప్రాంగణములో ఇంటిగ్రిటీ వాకథాన్‌ను నిర్వహించింది. ఈ ఐక్యత వాకథాన్ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, దక్షిణ మధ్య రైల్వేఅదనపు జనరల్ మేనేజర్ నీరజ్ అగర్వాల్, దక్షిణ మధ్య రైల్వే సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ జె.వినయన్‌, వివిధ శాఖలకు చెందిన ప్రధానాధిపతులు, హైదరాబాద్‌ డివిజన్‌, డివిజనల్‌ రైల్వే మేనేజర్‌, సీనియర్ రైల్వే అధికారులు, క్రీడాకారులు, రైల్వే సిబ్బంది, పాఠశాల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

అరుణ్ కుమార్ జైన్ సత్యనిష్ట, నిఘా ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు ర్యాలీని జెండా ఊపి ప్రారంభించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం- ప్రజా జీవితంలో సత్యనిష్ట సంస్కృతిని, నిస్వార్థతను పెంపొందించడానికి, అవినీతి ప్రతికూల ప్రభావాన్ని ప్రచారం చేయడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించడానికి, అవినీతిని సున్నా స్థాయికి తీసుకురావడానికి దక్షిణ మధ్య రైల్వే నిబద్ధతను పునరుద్ఘాటించడం.

ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ సత్యనిష్ట అంటే కేవలం నిజాయితీ మాత్రమే కాదు, మన మేధస్సు, మనస్సు యొక్క మిళితం అని కూడా తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో మంచి విలువలు, అభ్యాసాలను ఏకీకృతం చేస్తూ జీవన విధానంగా మార్చుకోవాలని, సహోద్యోగులు, పొరుగువారిలో కూడా ఆ సంస్కృతిని ప్రోత్సహించాలని ఆయన సూచించారు. కేవలం మనలో చిత్తశుద్ధిని పాటించడమే కాకుండా మన సమాజం చుట్టూ చిత్తశుద్ధితో కూడిన సంస్కృతిని వ్యాపింప చేయాలని అన్నారు. మనం చిత్తశుద్ధితో ఏది చేసినా అది మన జాతి సౌభాగ్యానికి తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు. నిఘా అవగాహన వారోత్సవంలో భాగంగా ప్రజలకు, పాఠశాల/కళాశాల విద్యార్థులకు మరియు రైల్వే సిబ్బందికి అవగాహన కల్పించేందుకు శిక్షణలు, సెమినార్‌లు, పోటీలు వంటి పలు కార్యక్రమాలను చేపట్టినందుకు విజిలెన్స్ శాఖను జనరల్ మేనేజర్ అభినందించారు. దేశ శ్రేయస్సు కోసం సంపూర్ణ సత్యనిష్ట నిజాయితీని కాపాడుకుందామని ప్రతిజ్ఞ చేద్దామని ఆయన పిలుపునిచ్చారు.
సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ జె.వినయన్ స్వాగతోపన్యాసం చేశారు. ఈ వాక్‌థాన్‌తో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు ముగిశాయని ఆయన పేర్కొన్నారు. నిజాయతీతో, గుణ బలంతో జాతిని ఏకతాటిపైకి తెచ్చిన ప్రసిద్ధి చెందిన గొప్ప నాయకుడైన సర్దార్ వల్ల భాయి పటేల్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం నిఘా అవగాహన వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జనరల్ మేనేజర్ జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీలో ‘కల్చర్ ఆఫ్ ఇంటెగ్రిటీ ఫర్ నేషన్స్ ప్రోస్పెరిటీ’ అనే అంశంపై నిర్వహించిన క్యారికేచర్ పెయింటింగ్ విజేతలకు సర్టిఫికెట్లను ప్రధానం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News