భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో(Airport) అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఐఎస్ఎఫ్ బలగాల పర్యవేక్షణను పెంచారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశాలతో 24 గంటల పాటు శాంతి భద్రతల విభాగం, ఇంటెలిజెన్స్, ఎస్‌బీ పోలీసుల సమన్వయంతో విమానాశ్రయానికి భద్రత కల్పించారు. ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ద్వారా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఎయిర్‌పోర్టు ద్వారా ప్రయాణం చేయాలనుకునే ప్రయాణికులు 3 గంటల ముందే విమానాశ్రయానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. మరోవైపు శంషాబాద్ విమానాశ్రయం నుంచి శ్రీనగర్, అమృత్‌సర్, జోధ్‌పుర్, చండీగఢ్, రాజ్‌కోట్ వెళ్లే విమాన సర్వీసులను రద్దు చేశారు.