ఆదివాసులు తమ న్యాయమైన హక్కుల కోసం ఐక్యంగా పోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క అన్నారు. అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం పురస్కరించుకొని ములుగు సమీపంలోని గట్టమ్మ వద్ద ఆదివాసి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ 1982, ఆగస్టు 9న జెనివాలో అటవి వనరుల హక్కులకు సంబంధించిన సమస్యలపై 26 మంది స్వతంత్ర మానవ హక్కుల మేధావులతో వర్కింగ్ గ్రూప్‌ల సమావేశాన్ని ఏర్పాటు చేయగా సమావేశంలో 140 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారని అన్నారు. ఆదివాసీల కోసం ఒక రోజు ఉండాలని ఐక్యరాజ్య సమితిని కమిటీ కోరగా, ఆదివాసుల సంరక్షణ చట్టాలకు ఐక్యరాజ్య సమితి ఆమోదం తెలిపిన రోజును అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు.
కార్యక్రమంలో జెడ్పి చైర్ పర్సన్ బడే నాగజ్యోతి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ అల్లెం అప్పయ్య, అన్నవరం రవికాంత్, మంకిడి రవి, కొత్త సదయ్య, కొత్త సురేందర్, ఆదివాసీ నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.
Seethakka: ఆదివాసి హక్కుల కోసం ఐక్యంగా పోరాటం
ములుగు సమీపంలోని గట్టమ్మ వద్ద ఆదివాసి జెండా ఆవిష్కరణ