Friday, April 4, 2025
HomeతెలంగాణSerilingampally-Yadagirigutta cycle yatra: శేరిలింగంపల్లి-యాదగిరిగుట్టకు సైకిల్ యాత్ర

Serilingampally-Yadagirigutta cycle yatra: శేరిలింగంపల్లి-యాదగిరిగుట్టకు సైకిల్ యాత్ర

అరికెపూడి గాంధీ కోసం..

శాసనసభ్యుడిగా అరికెపూడి గాంధీ ముచ్చటగా మూడవసారి హైట్రిక్ విజయం సాధించినందుకు సందర్భంగా వి.శ్రీనివాస్ అనే కార్యకర్త యాదగిరిగుట్ట వరకు సైకిల్ యాత్ర ప్రారంభించారు. శేరిలింగంపల్లిలోని తారానగర్ లో గల శ్రీ శ్రీ శ్రీ తుల్జా భవాని అమ్మవారి ఆలయం నుండి ఈ సైకిల్ యాత్రను శేరీ లింగంపల్లి కార్పోరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు అమ్మవారి ఆలయంలో రాగం నాగేందర్ యాదవ్ సమక్షంలో వేద పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా రాగం మాట్లాడుతూ ముచ్చటగా మూడవసారి హ్యాట్రిక్ విజయానికి దోహదపడ్డ నియోజకవర్గం ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అరికేపూడి ఇకముందు కూడా నియోజకవర్గ అభివృద్ధికి తన శక్తి మేరకు కృషి చేస్తానని రాగం ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ శ్రీనివాసరాజు ముదిరాజ్, భీమాని శ్రీనివాస్, వీరేశం గౌడ్, కటిక రామచందర్, డాక్టర్ రవి కుమార్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News