రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సంక్షేమపథకాలు చేరేలా, ప్రతి పల్లె అభివృద్ధి పథం లో పయనించే లక్ష్యంతో ముఖ్యమంత్రి కెసిఆర్ సారధ్యంలోని బిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నియోజకవర్గ పరిధిలోని నందిగామ మండలంలోని చాకలిదానిగుట్ట తండా, రంగాపూర్, మేక గూడ గ్రామాలలో పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామస్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పల్లెల్లో నెలకొన్న సమస్యలు తెలుసుకోవడం కోసమే గ్రామ గ్రామాన పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని,తెలుసుకున్న ప్రతి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రతి పల్లెలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి ఆదర్శ గ్రామాలుగా మారుస్తానన్నారు. పల్లెల అభివృద్ధిలో గ్రామస్థులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వికలాంగులకు ఉచిత బస్ పాసులు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, నాయకులు రాంబల్ నాయక్, రాజ్యలక్ష్మి, మామిళ్ళ విఠల్, ఆయా గ్రామాల సర్పంచ్ లు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.