Sunday, November 16, 2025
HomeతెలంగాణShadnagar: నాగులపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్డు మరమ్మతులు

Shadnagar: నాగులపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్డు మరమ్మతులు

నాగులపల్లి గ్రామంలో రోడ్డు గుంతలమయంగా మారిన కారణంగా గ్రామస్తులు, వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు గ్రామ నాయకులకు విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన నాగులపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు గుంతలుగా ఉన్న రోడ్డు ఎర్రమట్టితో మరమ్మతులు చేశారు.
ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ:
పంచాయితీ ఎన్నికలు ముగిసిన తరువాత పూర్తి స్థాయిలో బీటీ రోడ్డును వేసే అవకాశం ఉందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. త్వరలో గ్రామ అభివృద్ధికి అవసరమైన అన్ని పనులను చేయడానికి ఎల్లవేళలా కృషి చేస్తామని వారు తెలిపారు. ప్రజా పాలనతో ప్రతి సామాన్యుడికి న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు నందిమల రాములు గౌడ్, గ్రామ మాజీ సర్పంచ్ గోడల నర్సింలు, జి. భౌరయ్య టి.వెంకటేష్ , వి. యాదయ్యా, ఆవుల రవీందర్ రెడ్డి, అన్నారం నర్సింహ రెడ్డి, బి.శేఖర్ గౌడ్, భైరి సుదర్శన్ రెడ్డి ,కమలాజి నర్సింహ చారి, మహిపాల్ గౌడ్, వి.స్వామి, సతీష్ రెడ్డి, బి.హన్మంతు, ఎం. మల్లేశ్ , సంతు రెడ్డి, ఎల్. రాఘవేందర్ రెడ్డి, ఎ.నర్సింహ రెడ్డి, ఎం.సంపత్, డి.శివ కుమార్, గ్రామ గడిగల పాండు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad