Drugs Rocket: తెలంగాణలో డ్రగ్స్ రహిత సమాజమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఈగల్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. దీంతో ఈగల్ టీమ్ డ్రగ్స్ విక్రయాలు, అమ్మకాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇటీవల ఓ డగ్ర్ ప్లెడర్‌ను పట్టుకున్న అధికారులు చాకచక్యంగా వ్యవహరించారు. నిందితుడి ఫోన్ నుంచి కాంటాక్ట్ లిస్ట్‌లోని నంబర్లకు గంజాయి ఎక్కడ దొరుకుతుందో మెసేజ్ పెట్టారు. అంతే కొద్దిసేపట్లోనే దాదాపు 15 మంది ఆ లొకేషన్‌కు వచ్చారు. వీరిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, విద్యార్థులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారు. వీరిని డ్రగ్స్ ఎడిట్ సెంటర్లకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇప్పించారు. ఇదిలా ఉంటే తాజాగా డ్రగ్స్ దందాలో ఓ ఎస్‌ఐబీ( స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో) అధికారి కొడుకు పాత్రను ఈగల్ అధికారులు గుర్తించారు.
కొంపల్లిలోని మల్నాడు యజమాని సూర్య అమ్మినేనిని అరెస్ట్ చేసిన అధికారులు.. డ్రగ్స్ నెట్‌వర్క్‌పై దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో ఎస్‌ఐబీ అధికారి కొడుకు పాత్రను గుర్తించారు.దీంతో షాక్‌కు గురైన అధికారులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో వారికి కీలక విషయాలు తెలిశాయి. గతేడాది ఆ అధికారి కొడుకు డ్రగ్స్ దందాలో దొరికినా పోలీసులు అరెస్ట్ చేయకుండా జాప్యం చేశారని తేలింది. ఫోన్ ట్యాపింగ్‌లో ఈ ఎస్‌ఐబీ అధికారి పాత్ర ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి. అయితే అతడు అప్రూవర్‌గా మారారనే ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు డ్రగ్స్ వ్యవహారంలో ఆయన కొడుకు తెరపైకి రావడం పోలీసు శాఖలో కలకలం రేపుతోంది. ప్రస్తుతం నిందితుడు సూర్య అమ్మినేనితో పాటు అరెస్ట్ చేసిన ఆరుగురిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ దందాలో సెలబ్రెటీలతో పాటు ఇంకెవరి పాత్ర ఉందనే కోణంలో విచారణ చేస్తున్నారు.
ఇటీవల ఈగల్ అధికారులకు మల్నాడు కిచెన్ రెస్టారెంట్ యజమాని సూర్య అమ్మినేని డ్రగ్స్ దందాలో ఉన్నారంటూ సమాచారం అందింది. దీంతో అతడితో పాటు మరో ఆరుగురిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా ఎస్‌ఐబీ అధికారి కొడుకు రాహుల్ తేజ పాత్ర బయటపడింది. 2024లో కూడా రాహుల్ తేజపై డ్రగ్స్ కేసులో నిజామాబాద్ పోలీసులు కేసు నమోదుచేసి ఏ3 నిందితుడి ఎఫ్‌ఐఆర్ కూడా రెడీ చేశారు.అయినా ఇంతవరకు అతడిని అరెస్ట్ చేయలేదు. దీనిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా మిగతా నిందితులను విచారించగా తమకు రాహుల్ తేజ డ్రగ్స్ అందించే వాడని తెలిపారు. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి విక్రయించేవాడని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లు గుర్తించారు.
Also Read: నిరుద్యోగులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
నిందితులు వాంగ్మూలం ఇచ్చినా కూడా రాహుల్ తేజను ఎందుకు అరెస్ట్ చేయలేదని విచారించగా.. అతడు ఎస్‌ఐబీ అధికారి కొడుకని తేలింది. ఈ కేసులో ఏ3 గా ఉన్నప్పటికి కనీసం బెయిల్ కోసం కూడా దరఖాస్తు చేసుకోకపోవడంతో పోలీసులు నిందితుడికి ఎలా సహకరించారో స్పష్టమవుతుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఈగల్ అధికారులు ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దల దృష్టికి ఈ వ్యవహారం తీసుకెళ్లి అతడిపై చర్యల తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.


