Sunday, September 22, 2024
HomeతెలంగాణSiddipeta: భూసారాన్ని కాపాడుకుందామన్న హరీష్ రావు

Siddipeta: భూసారాన్ని కాపాడుకుందామన్న హరీష్ రావు

భూమి సారాన్ని కాపాడుకుంటేనే మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పత్తి మార్కెట్ ఆవరణలో భూమిత్ర మన తడిచెత్త- మన సేంద్రీయ ఎరువు- మన నేల సిద్ధిపేట బ్రాండ్ తో జీవ సంపన్న సేంద్రీయ ఎరువులను మంత్రి ప్రారంభించారు. కాలం మారిందని, ఎనకట రెండు పూటలా అన్నం తినడం ఉండేదని, ఈ రోజుల్లో పేదలు రెండు పూటలా అన్నం తింటుంటే, డబ్బున్న వాళ్లు గంజి, గట్కా, రొట్టెలు తింటున్నారని, కానీ రసాయనిక ఎరువులతో తిన్న ఆహారంతో బీపీ, షుగర్ లతో పరిస్థితి రివర్స్ అయిపోయి తిరోగమనం వైపు మనిషి పయనిస్తున్నాడని మంత్రి చెప్పుకొచ్చారు.
తడి చెత్తను ఎరువుగా, పొడి చెత్తను రీ సైక్లింగ్ కు, అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను సిమెంట్ కర్మాగారం కు విక్రయిస్తున్నట్లు, చెత్తను వెల్త్ ఆఫ్ వేస్ట్ గా మార్చుకోవడం సిద్దిపేట మున్సిపాలిటీ గొప్పతనంగా అభివర్ణించారు.
ప్రతి నెల 4500 కిలోల గ్యాస్ తయారు చేస్తున్నామని, అలాగే ప్రతి నెల 100 మెట్రిక్ టన్నుల ఎరువుల ఉత్పత్తి అవుతున్నదని, గ్యాస్ ద్వారా 3 లక్షలు, ఎరువుల ద్వారా 7.3 లక్షల ఆదాయం, పొడిచెత్త ద్వారా 11.30 లక్షల ఆదాయం మొత్తం 21 లక్షల పైగా ఆదాయం సిద్దిపేట మున్సిపల్ కు సమకూరుతుందని మంత్రి చెప్పారు.

వ్యవసాయ డ్రోన్ స్ప్రేయర్ పంపిణీ
మార్కెట్ యార్డు ఆవరణలో వ్యవసాయ డ్రోన్ స్ప్రేయర్లను మంత్రి హరీశ్ రావు పంపిణీ చేశారు. వ్యవసాయ పరికరాలు చిన్న, సన్న కారు రైతులకు అందుబాటులో తేవడానికి, తక్కువ రేటుకు అద్దెకు ఇవ్వడానికి మండల సమాఖ్య ఆధ్వర్యంలో కస్టమ్ హెరింగ్ సెంటర్స్-వ్యవసాయ పరికరాల అద్దె కేంద్రం ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. జిల్లాలో 21 మండల సమాఖ్యలు – రాయపోల్, సిద్ధిపేట అర్బన్ మినహా సీహెచ్ సీలను రూ.3.05 కోట్లతో ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో 75 శాతం, ఏం.ఎస్. సొంత నిధులు రూ.2.09 కోట్లు మరియు 25 శాతం ఎస్.ఆర్.ఎల్.ఎం రూ.96 లక్షలు వెచ్చించినట్లు వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News