Saturday, April 5, 2025
HomeతెలంగాణSidhipet: పోలీస్ కమిషనరేట్లో ఘనంగా ఆయుధపూజ

Sidhipet: పోలీస్ కమిషనరేట్లో ఘనంగా ఆయుధపూజ

దసరా సందర్భంగా..

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పెద్దకోడూర్ గ్రామ శివారులోగల సాయుధ దళాల కార్యాలయంలో పోలీస్ కమిషనర్ శ్వేత దుర్గాదేవి నవరాత్రుల్లో భాగంగా ఆయుధాలకు, ప్రభుత్వ వాహనాలకు, జమ్మి చెట్టుకు వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ చేసే ప్రతి పనిలో అధికారులు సిబ్బంది విజయం సాధించాలని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. పోలీస్ అధికారులకు, సిబ్బంది, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపిలు రాంచందర్రావు, సుభాష్ చంద్రబోస్, అందె శ్రీనివాసరావు, ఎస్ మల్లారెడ్డి, సిద్దిపేట ఏసీపి సురేందర్ రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ధరణి కుమార్, పూర్ణ చందర్, ప్రసాద్, రాజేష్, సిద్దిపేట రూరల్ సీఐ చేరాలు, ఆర్ఎస్ఐలు రోహిత్, సురేష్ కుమార్, రంజిత్, నిరంజన్, సాయి చరణ్, సాయి ప్రసాద్, మహిళా ఆర్ఎస్ఐ పుష్ప, చిన్నకోడూరు ఎస్ఐ సుభాష్ గౌడ్, ఏఆర్ అధికారులు సిబ్బంది మరియు సాయుధ దళ పోలీసులు, పోలీస్ మోటారు వాహనాల చోదకులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News