Saturday, November 23, 2024
HomeతెలంగాణSingareni profits all time high: సింగరేణి నికర లాభాలు ఆల్ టైం హై

Singareni profits all time high: సింగరేణి నికర లాభాలు ఆల్ టైం హై

2022-23 లో లాభాలు 2,222 కోట్లు

ప్రత్యేక తెలంగాణ రాకపూర్వంతో పోలిస్తే 430 శాతం వృద్ధి గత ఏడాదితో పోలిస్తే 81 శాతం వృద్ధి కోల్ ఇండియాతో సహా మహారత్న కంపెనీలు అన్నిటికన్నా లాభాల వృద్ధిలో మొదటి స్థానం సింగరేణిదే, రెండవ స్థానంలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, నాలుగో స్థానంలో కోల్ ఇండియా ప్రతికూల పరిస్థితుల్లో కూడా గరిష్టంగా అమ్మకాలు, లాభాలు… సింగరేణి సంస్థ 2022-23 ఆర్థిక సంవత్సరంలో తన చరిత్రలోనే అత్యధికంగా 33,065 కోటల్ రూపాయల టర్నోవర్ తో రూ. 2 వేల 222 కోట్ల నికర లాభాలను ఆర్జించి సరికొత్త రికార్డు సృష్టించింది. శుక్రవారం సంస్థ చైర్మన్ & ఎండీ ఎన్.శ్రీధర్ ఈ వివరాలను
ప్రకటిస్తూ ప్రతికూల పరిస్థితుల్లో కూడా అధికోత్పత్తికి కృషి చేసి అతయధిక టర్నోవర్, లాభాలు సాధించిన కార్మికులు, ఉద్యోగులు, అధికారులకు, యూనియన్ నాయకులకు తన అభినందనలు తెలియజేశారు.

- Advertisement -

వివరాలు ఈ విధంగా ఉన్నాయి…

సింగరేణి సంస్థ గత ఆర్థిక సంవత్సరం 2022-23లో బొగ్గు అమ్మకాలు, విద్యుత్ అమ్మకాల ద్వారా మొత్తం రూ.3,074 కోట్ల స్థూల లాభాలను ఆర్జించింది. కాగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మరియు ఇతర ట్యాక్స్ చెల్లింపుల అనంతరం రూ.2,222 కోటల్ నికర లాభాలను సంస్థ ఆర్జించింది. సింగరేణి చరిత్రలోనే ఇది ఒక ఆల్ టైం రికార్డ్. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2021-22 లో సింగరేణి సాధించిన నికర లాభాలు రూ.1,227 తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరం సాధించిన లాభాలు 81శాతం అధికం. అలాగే టర్నోవర్ కూడా 2021-22 సంవత్సరంలో సాధించిన రూ.26,585 కోట్లపై గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో సాధించిన రూ.33,065 టర్నోవర్ 24 శాతం అధికం. 2022-23 సింగరేణి సాధించిన టర్నోవర్ లో బొగ్గు అమ్మకం ద్వారా రూ28, 650 కోట్లు, విద్యుత్ అమ్మకం ద్వారా రూ4,415 కోట్లను గడిచింది. గత 9ఏళ్లలో లాభాల్లో 430 శాతం వృద్ధి.. అమ్మకాల్లో 175 శాతం వృద్ధి.. తెలంగాణ రాష్ట్రం ఏరపడక ముందు 2013-14 సంవతసరంతో పోల్చితే సింగరేణి సంస్థ లాభాలలో అబ్బుర పరిచే విధంగా 430 శాతం వృద్ధిని సాధించడం విశేషం. 201314లో సింగరేణి రూ.419 కోట్ల నికర లాభాలు సాధించగా.. గత ఆర్థిక సంవతసరం రూ.2,222 కోట్ల సాధించి అతయధిక వృద్ధిని నమోదు చేసింది. ఇదే కాలంలో దేశంలోని వివిధ మహారత్న కంపెనీలు సాధించిన లాభాల వృద్ధి కన్నా కూడా సింగరేణి సాధించిన వృద్ధి చాలా ఎక్కువ గా ఉంది. సింగరేణి సంస్థ 430 శాతం వృద్ధితో మొదటి స్థానంలో ఉండగా.. 241 శాతం వృద్ధితో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ రెండవ స్థానంలో, 114% వృద్ధితో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మూడో స్థానంలో, 86% వృద్ధితో కోల్ ఇండియా నాలుగవ స్థానంలో ఉందన్నారు. గత ఏడాది సాధించిన లాభాలపై 81% వృద్ధి.. సింగరేణి సంస్థ అంతకుముందు ఏడాది 2021-22 లో రూ.1,227 కోట్ల రూపాయల లాభాలు సాధించగా గత ఆర్థిక సంవత్సరం 2022-23 లో రూ.2,222 కోట్ల నికర లాభాలు సాధించి 81% వృద్ధిని నమోదు చేసింది. ఈ విధంగా 2021-22 ఆర్థిక సంవత్సరం పై గత ఆర్థిక సంవత్సరంలో సాధించి లాభాల వృద్ధిలో మహారత్న కంపెనీల కన్నా సింగరేణి సంస్థ అగ్రస్థానంలో ఉంది. 62 శాతం లాభాల వృద్ధితో కోల్ ఇండియా రెండవ స్థానంలో నిలిచింది. సింగరేణి 2021-22 పై సాధించిన వృద్ధి… తెలంగాణ రాష్ట్రంలోనే అత్యద్భుత అభివృద్ధి. సింగరేణి సంస్థ తన 134 సంవత్సరాల చరిత్రలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాతనే అత్యద్భుత ప్రగతి సాధించిందని పేర్కొన్నారు. బొగ్గు ఉత్పత్తి లో 33 శాతం వృద్ధి, బొగ్గు రవాణాలో 39 శాతం, అమ్మకాలలో 177% లాభాలలో 430 శాతం వృద్ధిని సాధించిందని ఇది సింగరేణి చరిత్రలోనే అత్యధిక రికార్డులు న్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చందరశేఖరరావు సహకారంతో సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి, ధర్మల్ విద్యుత్ ఉత్పాదన ద్వారా గణనీయమైన టర్నోవర్, లాభాలు సాధించిందన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో తాము కూడా భాగస్వామ్యులు కావాలన్న ఉద్దేశంతో సింగరేణి అధికారులు, కార్మికులు ఉద్యోగులు అంకితభావంతో పనిచేసి కంపెనీని దేశంలో అగ్రస్థానంలో నిలిపారని ఆయన తన అభినందనలు తెలియజేశారు. ఈలాభాల ద్వారా సింగరేణి మరిన్ని కొత్త ప్రాజెక్టులను చేపడుతుందని, అలాగే కార్మికులకు లాభాల్లో వాటాగా అత్యధిక బోనస్, మరిన్ని సంక్షేమ కారయకరమాలు చేపటటడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది కూడా నిరదశించిన లక్ష్యాలు సాధిస్తే రూ.4 వేల కోట్ల లాభాలు సాధించే అవకాశం ఉందన్నారు. సింగరేణీ ఉద్యోగులు సమష్టిగా కృషి చేసి లక్ష్యాలు సాధించాలని చైర్మన్ & ఎమ్.డి పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News