ఆర్కే-7 గ్రూప్ ఏజెంట్ గా బాధ్యతలు స్వీకరించారు మాలోత్ రాముడు. బాధ్యతలు స్వీకరించిన మాలోత్ రాముడు ని ఆర్కే-7 గని మేనేజర్ సాయి ప్రసాద్, గ్రూప్ ఇంజనీర్ రాజా రవి చరణ్, గుర్తింపు సంఘం ఫిట్ సెక్రటరీ మేండే వెంకటి వారికి స్వాగతం పలుకుతూ శాలువతో ఘనంగా సత్కరించడం జరిగింది. మాలోత్ రాముడు గని ఆవరణలో ఉన్న శ్రీ మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం వారి కార్యాలయంలో గ్రూప్ ఏజెంట్ అధికారిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రక్షణ అధికారి రవిశంకర్, ఏరియా సెక్రటరీ అశోక్, సంక్షేమ అధికారి శాంతన్, సర్వే ఆఫీసర్ శ్రీనివాస్, ఆఫీస్ ఉద్యోగులు పాల్గొన్నారు.