బిఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుండి బీఅర్ఎస్ లో చేరిన 50 మంది పెద్దమందడి మండలం చీకటిచెట్టు తండా వాసులు .. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొమ్మిదేళ్లలో ప్రగతిబాటలో తెలంగాణ సాగుతుందని,కేసీఆర్ నాయకత్వంలో సాగునీరు, తాగునీరు, 24 గంటల కరంటు, వ్యవసాయ వృద్ది, పరిశ్రమల రాకతో పెరిగిన ఉపాధి అవకాశాలు పెరిగాయి అన్నారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణ వ్యవసాయ విధానాలు, విద్య, వైద్య రంగాలలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు.
తెలంగాణ అభివృద్ధి దేశాన్ని ఆకర్షిస్తున్నదనీ,పనిచేసే ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు కొనసాగాలి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి, జడ్పీటీసీ రఘుపతిరెడ్డి, ప్రైవేటు ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంధం రాములు, మండల రైతుబంధు సమితి అధ్యక్షులు రాజాప్రకాష్ రెడ్డి, మాజీ ఎంపీపీ మన్నెపురెడ్డి, సర్పంచ్ వెంకటేష్, ఉప సర్పంచ్ రమేష్ నాయక్, పార్టీ అధ్యక్షుడు మోహన్ బాబు, బీఆర్ఎస్ నేతలు విట్టా శశివర్దన్ రెడ్డి, దొడగుంటపల్లి శ్రీనివాస్ రెడ్డి, రామేశ్వర్ రెడ్డి, ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.