Saturday, October 5, 2024
HomeతెలంగాణSingireddy Niranjan Reddy: మంచి చేశా మళ్లీ గెలిపించండి

Singireddy Niranjan Reddy: మంచి చేశా మళ్లీ గెలిపించండి

నాగం, రావులతో కలిసి విజ్ఞప్తి చేసిన నిరంజన్

మంచి చేశా మళ్లీ గెలిపించండి అంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి ముఖ్య నాయకుల కార్యకర్తల సన్నాహక సమావేశంలో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ గెలుపు .. ప్రజలందరి గెలుపు గా ఉంటుందని, ప్రభుత్వం చేప్పట్టిన అభివృద్ధి పనులు, జరగాల్సిన అభివృద్ధిని ప్రజలు గమనించాలని ఆయన అన్నారు. 60 ఏండ్ల పాటు వలస పాలనలో రెండు తరాల భవిష్యత్ ను నష్టపోయామని, ఉమ్మడి జిల్లాలోనే విలక్షణమైన తీర్పు ను ఇవ్వడం వనపర్తి ప్రజలు ఇస్తారని, చేసే ప్రతి పనిని గమనిస్తూ అభివృద్ధి చేసే నాయకుడికి వనపర్తి ప్రజలు పట్టం కడతారని ఆయన అన్నారు.

- Advertisement -

మీ ఆశల, ఆకాంక్షల మేరకు పని జరిగిందని అనిపిస్తే భారీ మెజారిటీతో గెలిపించండి అంటూ ఆయన ప్రజలను కోరారు.ప్రజలు ఆలోచించుకునే విధంగా పనులు చేసుకుంటూ పోతూ ప్రజాభిమానాన్ని పొందుతామని ఆయన అన్నారు. ఎంపీ రాములు మాట్లాడుతూ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రజల మనుషులుగా మీ ముందున్నమని, తెలంగాణ అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి ప్రభుత్వం వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కృష్ణార్జున లాగా మంత్రి నిరంజన్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారని, అందులో నాగం జనార్దన్ రెడ్డి సలహాలు సూచనలు కలిసి మంత్రి నిరంజన్ రెడ్డి భారీ మెజారిటీ తప్పక వస్తుందని ఆయన అన్నారు.

ఎందుకు నిరంజన్ రెడ్డిని గెలిపించాలంటే అభివృద్ధి చేసిన నాయకుడిని గెలిపించాలి అందుకే నిరంజన్ రెడ్డిని గెలిపించాలని, జిల్లాలో చేయని పని లేదు భవిష్యత్తు లో ఎం చేయాలో ఇప్పటి వరకే అందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసుకుని పెట్టుకున్నారని ఆయన అన్నారు. మాజీ రాజ్యసభ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి ప్రశాంతంగా ఎన్నికలు జరిగి మంత్రి నిరంజన్ రెడ్డి కి భారీ మెజారిటీతో గెలిపించుకుంటమని,ఎన్నికలు ఒక యజ్ఞం, యుద్ధం లాగా కార్యకర్తలు అందరు కలిసి మంత్రి నిరంజన్ రెడ్డిని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.గంట సేపు మాట్లాడిన ప్రసంగంలో ఎందుకు తెలంగాణ రావాలి వస్తే ఏం జరుగుతుంది అనే అంశాలపై మాట్లాడినట్టు తెలిపారు.

నాచాహళ్లి నుండి మాజీ సర్పంచ్ రాములు, ఆధ్వర్యంలో నలుగురు, ఖాసీం నగర్ నుండి రెవల్లి రాము ఆధ్వర్యంలో 17 మంది, బండరావిపాకుల నుండి 10 మంది కాంగ్రెస్ బీజేపీ నాయకులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి మాజీ రాజ్యసభ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి ల సమక్షంలో జిల్లా పార్టీ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ పార్టీలో చేరారు . జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి , జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ , నాగం తిరుపతి రెడ్డి , జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ , రీజనల్ అథారిటీ సభ్యులు ఆవుల రమేష్ మీడియా సెల్ కన్వీనర్లు నందిమల్ల శ్యాం నందిమల్ల అశోక్,ఈ కార్యక్రమంలో శిక్షణ తరగతుల జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి గారు, మండల యువజన సంఘం అధ్యక్షుడు చిట్యాల రాము, ఉపాధ్యక్షుడు ప్రతీష్ గౌడ్ , తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News