Sunday, September 8, 2024
HomeతెలంగాణSirisilla: కాలిన చెట్లను సంరక్షించే మార్గాలు అన్వేషించాలి

Sirisilla: కాలిన చెట్లను సంరక్షించే మార్గాలు అన్వేషించాలి

ఎంపి అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్

రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులను ఆదుకోవాలని కరీంనగర్ బిఆర్ఎస్ ఎంపి అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి తాడూర్ లోని ఎల్లమ్మ దేవాలయం వద్ద ఇటీవల సుమారు 300ల తాటి చెట్ల వనం దగ్ధం అయింది. కాగా ఆ ప్రదేశాన్ని బిఆర్ఎస్ నాయకులు, గీత కార్మికులతో కలిసి వినోద్ కుమార్ పరిశీలించారు. గౌడ కులస్తులకు అధైర్య పడద్దని అండగా ఉంటామని భరోసా కల్పించారు. చిగుర్లు రాకుంటే వాటి స్థానంలో పొట్టి తాళ్ళు పెట్టిస్తానని హామీ ఇచ్చారు. గీత కార్మికులు ఉపాధి కోల్పోయారని, ప్రభుత్వం తక్షణమే సాయం అందించాలని జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాటి వనం కాలిపోవడంతో కల్లు గీసుకుని జీవనోపాధి పొందే గీత కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. వెంటనే గీత కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

కాలిన తాటి చెట్లను ఏ మేరకు రక్షించవచ్చు అనే అంశంపై వెంటనే శాస్త్రవేత్తలను పంపించి, కాలిన తాటి చెట్లను పరిశీలించే విధంగా చూడాలని సూచించారు. కాలిన తాటి చెట్లు వర్ష కాలంలోగా చిగురించకుంటే.. గతంలో వారు బీహార్ రాష్ట్రంలోని పాట్నా నుంచి పొట్టి తాటి విత్తనాలు తెప్పించి కరీంనగర్ పార్లమెంట్ పరిదిలోని గీత కార్మికులకు పంపిణీ చేయడం జరిగిందని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా పొట్టి తాటి విత్తనాలను ఆయన సొంత ఖర్చులతో తీసుకురావడంతో పాటు.. ఒక వేళ నర్సరీలలో పొట్టి తాటి మొక్కలు దొరికిన కూడా కాలిన తాటి చెట్ల ప్రదేశంలో నాటిస్తామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఎంపీపీ పడిగెల మానస రాజు, జిల్లా సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు మాట్ల మధు, ప్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్ గౌడ్, వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకట రమణారెడ్డి, ఎంపీటీసీ దుర్గయ్య, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు పడిగల రాజు కందుకూరి రామా గౌడ్, మాజీ సర్పంచులు, గీత కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News