Thursday, September 19, 2024
HomeతెలంగాణHyd: అయోధ్యలో రామ ప్రతిష్ట - అన్నమయ్యపురంలో రామ స్మరణం

Hyd: అయోధ్యలో రామ ప్రతిష్ట – అన్నమయ్యపురంలో రామ స్మరణం

శోభారాజ్ సంకీర్తనలు

అయోధ్య బాల రామ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా అన్నమయ్యపురంలో మామిడాకులు, అరటి పందిరిలో అన్నమాచార్య భావనా వాహిని అధ్యక్షులు పద్మ శ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభా రాజు సమక్షంలో శ్రీ సీతా సమేత రామ లక్ష్మణ హనుమ విగ్రహ పూజ, అంగరంగ వైభవంగా రామ సంకీర్తనలను భక్తిపూర్వకంగా ఆలపించి అలరించారు.

- Advertisement -

ఇందులో భాగంగా పద్మశ్రీ శోభారాజు రామభద్ర రారా, వారి శిష్య బృందం వసంతి వాల్మీకి కోకిల అనే పాట పాడగా, జయశ్రీ అపుడేమనే ఎమనుమనెనో అనే అన్నమయ్య సంకీర్తన, జనని భవిష్య రామ నామ సంకీర్తనతో అలరించింది.

కాగా ఈ కార్యక్రమానికి పద్మశ్రీ శోభారాజు శిష్యుడు కళ్యాణ్ తబలా మీద వాయిద్య సహకారం అందించారు.
అనంతరం శ్రీ సీతా సమేత రామ లక్ష్మణ హనుమ స్వాముల వారికి దివ్య హారతులు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా. నందకుమార్ అందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News