Thursday, January 16, 2025
HomeతెలంగాణKCR: కేసీఆర్‌తో కలిసి మొక్క నాటిన కేటీఆర్ తనయుడు

KCR: కేసీఆర్‌తో కలిసి మొక్క నాటిన కేటీఆర్ తనయుడు

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. తాజాగా ఆయన మనవడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తనయుడు హిమాన్షుతో సరదాగా గడిపారు. వ్యవసాయం క్షేత్రంలో మనవడితో కలిసి మొక్కలు నటించారు.

- Advertisement -

హిమాన్షు పారను పట్టుకొని గుంత తవ్వి మొక్కను నాటుతుండగా కేసీఆర్ పక్కనే నిలబడి సూచనలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో హిమాన్షు పేర్ చేసుకున్నాడు. ఈ వీడియోకు ‘లెర్నింగ్ ఫ్రమ్ ది బెస్ట్’ అని క్యాప్షన్ ఇచ్చాడు. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి చెట్లు పెంచడం ఎంతో అవసరమని, సహజ వనరులను రక్షించడం… సంరక్షించడం మన బాధ్యత అని తెలిపాడు. ఈ వీడియోను గులాబీ కార్యకర్తలు తెగ వైరల్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News