Thursday, July 4, 2024
HomeతెలంగాణSrinivas Goud: దేశవ్యాప్తంగా కులగణన చేయాలి

Srinivas Goud: దేశవ్యాప్తంగా కులగణన చేయాలి

పది లక్షల ట్వీట్ లతో 'కుల గణన కోసం ఉద్యమిద్ధాం మహా ఉద్యమం

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టాలని అందుకోసం ప్రతి ఒక్కరు ఉద్యమించాలని రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా OBC స్టూడెంట్స్ అసోసియేషన్ (AIOBCSA) ఆధ్వర్యంలో రూపొందించిన కుల గణన కోసం లక్ష పోస్టు కార్డుల ద్వారా పది లక్షల ట్వీట్ లతో మహా ఉద్యమాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ‘కుల గణన కోసం ఉద్యమిద్ధాం’ అనే వాల్ పోస్టర్ ను హైదరాబాదులోని తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఓబిసి స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు కిరణ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రావణ్, తెలంగాణ సాగర సంగం అధ్యక్షుడు శేఖర్ సాగర్, తెలంగాణ గౌడ ఐక్య సాధన సమితి అధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ్, మహబూబ్నగర్ మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాజేంద్ర ప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News