Saturday, November 23, 2024
HomeతెలంగాణSrinivas Goud: యువ పారిశ్రామికవేత్తలతో శ్రీనివాస్ గౌడ్ భేటీ

Srinivas Goud: యువ పారిశ్రామికవేత్తలతో శ్రీనివాస్ గౌడ్ భేటీ

7 దేశాలకు చెందిన 13 మంది యంగ్ బిజినెస్ టైకూన్స్ తో మంత్రి

రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ గారిని హైదరాబాద్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన కార్యాలయంలో యూత్ అంబాసిడర్స్ ప్రోగ్రాం (YAP) లో భాగంగా 7 దేశాలు ఆస్ట్రియా, జర్మనీ, ఇటలీ, డెన్మార్క్, ఫిన్లాండ్, నెదర్లాండ్ అండ్ బెల్జియంలకు చెందిన 13 మంది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బిజినెస్ కుటుంబాలకు చెందిన యువ పారిశ్రామికవేత్తలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యాపార అవకాశాలు, సాంస్కృతి, సాంప్రదాయాలు, హెరిటేజ్ లపై అధ్యయనం చేయడానికి 15 రోజుల తమ పర్యటనలో భాగంగా మర్యాద పూర్వకంగా కలిశారు.

- Advertisement -

ఈ సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ వివిధ దేశాలకు చెందిన 13 మంది యువ పారిశ్రామికవేత్తలు కు తెలంగాణ రాష్ట్ర ప్రాముఖ్యత, చారిత్రక, వారసత్వ సంపద , వ్యాపార అవకాశాలు, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన ఇండస్ట్రియల్ పాలసీ , IT, ITes, ఫార్మా పరిశ్రమల కు ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వ సహకారం లాంటి ప్రోత్సాహకాలను యూత్ అంబాసిడర్స్ కు వివరించారు.

ఈ కార్యక్రమంలో యూత్ అంబాసిడర్స్ కో – ఆర్డినేటర్ నవీన్ మల్వే, జర్మనీకి చెందిన Robin Tiburtius, Lukas Weber, Finn Bolta, Miwa Junghanns, Franziska Wieser, Mara Kramer, ఆస్ట్రియా కు చెందిన Julia Fasser బెల్జియం కు చెందిన Tim Caelen, Finland కు చెందిన Wilma Laine, Svenne Smit – Netherlands, డెన్మార్క్ కు చెందిన Emma Linde Jakobsen, Ida Goul Jemsen, Italy కి చెందిన Filippo Corain లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News