నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానం నుండి పాతాళ గంగలో నివసించే గంగాపుత్ర నాగమల్లయ్య ఆయన భార్య రవణమ్మ వీరిరువురు ఆటోలో శ్రీశైలం నుండి కొల్లాపురానికి వెళుతుండగా మార్గమధ్యంలో జీనుకుంట గ్రామం వద్ద కుక్క అడ్డం రావడంతో సడన్ బ్రేక్ వేయడంతో ఏపీ 39 టీఈ 7600 నెంబర్ గల ఆటో బోల్తాపడడంతో రక్తమడుగులలో ఉన్న రవణమ్మను చూసి దిక్కు తెలియని పరిస్థితిలో ఉన్న నాగమల్లయ్యకు తెలంగాణ నాగర్ కర్నూల్ జిల్లా చిలకాపల్లి పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి రక్తమడుగులో ఉన్న రవణమ్మను చూసి 108 అంబులెన్స్ సిబ్బందికి కాల్ చేసి అంబులెన్స్ లో మెరుగైన వైద్యం కోసం నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో ఏఐటీయూసీ నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారేడు శివశంకర్ దెబ్బలు తగిలిన రవణమ్మను ఎక్స్రే తీయించి వారికి దగ్గరుండి వైద్యం అందేలా సహకరించినందుకు అలాగే రోడ్డు ప్రక్కన పడి ఉన్న ఆటోను తెలకపల్లి పోలీసులు దాన్ని సురక్షితంగా తీసుకొని వెళ్లి స్టేషన్లో ఉంచి మరల శ్రీశైల దేవస్థానంకు అప్పజెప్పినందున వలన ఎస్సైకి పోలీస్ అధికారులకు శ్రీశైల దేవస్థానం ఆటో యూనియన్ డ్రైవర్ ఓనర్స్ ఏఐటియుసి జనరల్ సెక్రెటరీకి కృతజ్ఞతలు తెలియజేశారు.