Sunday, July 7, 2024
HomeతెలంగాణSudhir Reddy: మహిళా సంక్షేమ దినోత్సవంలో సుదీర్ రెడ్డి

Sudhir Reddy: మహిళా సంక్షేమ దినోత్సవంలో సుదీర్ రెడ్డి

‘గృహలక్ష్మి’ పేరిట సొంత జాగ ఉండి ఇల్లు కట్టుకుంటే మహిళల పేరిట రూ.3 లక్షల ఆర్థిక సాయం

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవ కార్యక్రమం చింతలకుంట నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పలురంగాల్లో నిర్ణయాత్మక పాత్రను పోషిస్తున్న మహిళల స్వావలంబన,సాధికారత కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అవిరళ కృషి చేస్తున్నరని సుధీర్ రెడ్డి తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, ఒంటరి మహిళలకు పింఛన్లు, కేసీఆర్‌ కిట్‌, న్యూట్రిషన్‌ కిట్‌, ఆరోగ్య మహిళ తదితర పథకాలు త్వరలో ‘గృహలక్ష్మి’ పేరిట ఇల్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షల ఆర్థిక సాయం, మహిళల రక్షణకు షీ టీమ్స్‌, భరోసా కేంద్రాల ఏర్పాటు, మార్కెట్‌ కమిటీల్లోనూ మహిళలకు రిజర్వేషన్లు ప్రకటిస్తామన్నారు. గతంలో ఆడబిడ్డ పుట్టిందంటే అమ్మో ఆడబిడ్డ అని ఆందోళన చెందేవారు.ఇప్పుడు పరిస్థితులు మారాయని తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఆడబిడ్డల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నదని అన్నారు.ఈ తొమ్మిదేండ్ల సుపరిపాలనలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ కొండంత భరోసాను కల్పిస్తున్నదని, అమ్మాయి పుట్టగానే కేసీఆర్‌ కిట్‌ పథకంతో మొదలుకొని పెండ్లికి ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నదిని, వారి ఆరోగ్యం కోసం ఆరోగ్య మహిళా పథకాన్ని అమలు చేస్తూ న్యూట్రిషన్‌ కిట్స్‌ అందజేస్తున్నదన్నారు. త్వరలో ‘గృహలక్ష్మి’ పేరిట సొంత జాగ ఉండి ఇల్లు కట్టుకుంటే మహిళల పేరిట రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు.అతివలకు రక్షణగా షీ టీమ్స్‌,భరోసా కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చిందని,మార్కెట్‌ కమిటీల్లోనూ రిజర్వేషన్‌ కల్పించడంతోపాటు ఉద్యోగిణులకు ప్రసూతి సెలవులనూ పెంచి మహిళలకు అండగా నిలుస్తున్నది.గ్రామీణ మహిళలు ఆర్థికంగా ఎదుగాలన్న ఉద్దేశంతో విలేజ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కార్యక్రమంతో వ్యాపారాలు చేసుకునేందుకు బ్యాంకు లింకేజీ,స్త్రీనిధి,గ్రామసంఘం నిధుల ద్వారా రుణాలను ఇస్తూ జీవనోపాధిని కల్పిస్తున్నది. స్వయం సహాయక సంఘాల సభ్యులు వ్యాపారులుగా,చిన్న తరహా పారిశ్రామిక వేత్తలుగా మారారని తెలిపారు.ఇలా మహిళల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఎగ్గే మల్లేశం,దయనంద్ గుప్తా,ఎల్.బి.నగర్ జోనల్ కమిషనర్ పంకజ,డిప్యూటీ కమిషనర్లు మారుతి దివాకర్,కృష్ణయ్య, హాయత్ నగర్ ఏం.ఆర్.ఓ.సంధ్యారాణి,కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం చైర్మన్ ఈశ్వరమ్మ యాదవ్,అధికారులు అశ్విని, సుస్మిత, కృష్ణ వేణి, సృజన, నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్ల మహిళా అధ్యక్షురాలు, సీనియర్ నాయకులు, అంగన్వాడీ మహిళలు, స్వీపర్లు, పలు స్వచ్ఛంద సంస్థ మహిళలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News