Wednesday, October 30, 2024
HomeతెలంగాణSunke Ravi: బహుజనుల బాహుబలి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

Sunke Ravi: బహుజనుల బాహుబలి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

గోల్కొండను అధిష్టించిన ధీరుడు

రామడుగు మండలం గోపాల్రావుపేట గ్రామంలో పాత బస్టాండ్ చౌరస్తాలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ… బహుజనుల బాహుబలి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గోల్కొండను అధిష్టించిన ధీరుడు అని అన్నారు. గౌడన్నలకు 5లక్షల మరణ బీమా, 3 లక్షలతో ప్రమాద బీమాను అందించేది బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే అని అన్నారు.

- Advertisement -


50 సంవత్సరాలు నిండిన గౌడన్నలకు అసరా పెన్షన్లు ఇస్తున్నామన్నారు. హరితహారం కార్యక్రమం ద్వారా తాటి ఈత వనాలను ప్రభుత్వం ద్వారా ఈత చెట్లను, గిరక తాటి చెట్లను పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కర్ర సత్య ప్రసన్నారెడ్డి ఎంపీపీ కలిగేటి కవిత లక్ష్మణ్ ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఎడవల్లి నరేందర్ రెడ్డి ఉప సర్పంచ్ ఎడవల్లి మధుసూదన్ రెడ్డి సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు మార్కెట్ కమిటీ చైర్మన్ మామిడి తిరుపతి ఉపాధ్యక్షులు చాడ ప్రభాకర్ రెడ్డి పార్టీ మండల అధ్యక్షుడు జితేందర్ రెడ్డి గౌడ సంఘం అధ్యక్షులు కొండ వెంకటయ్య ఉపాధ్యక్షులు సుద్దాల మల్లేశం మాజీ సర్పంచ్ నేరెళ్ల ఆంజనేయులు గౌడ్ గౌడ సంఘం సభ్యులు వివిధ కుల సంఘాల సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News