Thursday, October 3, 2024
HomeతెలంగాణSunke Ravi: కాంగ్రెస్ లో సీఎం అభ్యర్థులెక్కువ, ఓట్లు తక్కువ

Sunke Ravi: కాంగ్రెస్ లో సీఎం అభ్యర్థులెక్కువ, ఓట్లు తక్కువ

రాహుల్ గాంధీ వస్తే జనాలే లేరు

గంగాధర మండలం మధుర నగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ను ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి సీఎం అభ్యర్థులు ఎక్కువ, వాళ్లకు వచ్చే సీట్లు తక్కువ, వాళ్లకు వచ్చే ఓట్లు తక్కువ, ఒకరికి ఒకరు పొడుచుకునే వెన్నుపోట్లు ఎక్కువ, అభ్యర్థులే ఫైనల్ కాలేదు పదిమంది సీఎంల అభ్యర్థుల పేర్లు బయటికి వస్తున్నాయన్నారు. మొన్న జానారెడ్డి, ఇవాళ జగ్గారెడ్డి, రేపు జీవన్ రెడ్డి రేపు ఇంకెవరో తెలవదన్నారు. రోజుకో సీఎం అభ్యర్థితో ఆ పార్టీ ఇంకా కొట్లాడుకుంటూనే ఉందన్నారు. పొరపాటున అధికారంలోకి వచ్చినా ఆ పార్టీ కనీసం పట్టుమని ఆరు నెలలు కూడా అధికారంలో ఉండదన్నారు. వాళ్లంతట వాళ్లే గ్రూపులు కట్టి ప్రభుత్వాన్ని కూల్చేసుకుంటారని ఆ పార్టీకి ప్రధానమంత్రిగా చెప్పుకునే రాహుల్ గాంధీ వస్తే కనీసం కరీంనగర్లో 500 మంది లేరన్నారు. రాహుల్ గాంధీ వచ్చింది అసెంబ్లీ ఎన్నికల ప్రచారానీకా లేక స్థానిక సంస్థల్లో ఓ ఊరు వార్డు మెంబర్ కు ప్రచారం చేయడానికి వచ్చారా అని రాహుల్ గాంధీ వచ్చినా కూడా గ్రూపు కొట్లాటలు తగ్గలేదన్నారు. ఈ రాష్ట్రానికి కెసిఆర్ పాలనే శ్రీరామరక్ష అని ఈ రాష్ట్రానికి కెసిఆర్ ఏ ధైర్యం తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఒక గొప్ప ఆస్తి అని ఆ విలువైన ఆస్తిని తెలంగాణ ప్రజలు కాపాడుకుంటారన్నారు. సంపద పెంచు పేదలకు పంచు అన్నదే కేసీఆర్ నినాదం కేసీఆర్ ఆలోచన అదే కేసీఆర్ లక్ష్యం అన్నారు. అదే కాంగ్రెస్ పార్టీ బిజెపి వస్తే పేదోని కొట్టు పెద్దోనికి పెట్టు అని ఉన్న సంపద ఉడ్చి కాకులకు గద్దలకు పప్పు బెల్లా లెక్క పంచి పెడతారన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News