జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని కొడిమ్యాల, నల్లగొండ క్లస్టర్ పరిధిలోని రైతు వేదికలను చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులందరు ఒకే దగ్గర కూర్చుని పంట విధి విధానాలపై చర్చించే వేదిక రైతు వేదిక. నాడు వ్యవసాయమే దండగ అన్నారు ఇప్పుడు వ్యవసాయమే పండుగ, పల్లెల అభివృద్ధే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని, పల్లెల అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తుందని, పల్లెలు పచ్చదనంతో ఉండేందుకు హరితహారం కార్యక్రమం,పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడం, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్లో పూటిక తీపించడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ స్వర్ణలత, ఎంపిటిసి ప్రశాంతి, కొడిమ్యాల సర్పంచ్ ఏలేటి మమత- నరసింహారెడ్డి, సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు కృష్ణారావు సింగిల్ విండో చైర్మన్ రాజనర్సింగరావు, వైస్ ఎంపీపీ పర్ల పెల్లి ప్రసాద్, బి ఆర్ఎస్ మండల అధ్యక్షుడు పులి వెంకటేష్ గౌడ్, అంకం రాజేశం,వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బిఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.