Friday, September 20, 2024
HomeతెలంగాణSunke Ravi: సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి

Sunke Ravi: సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి

గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామంలోని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్వగృహంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా,యూత్, విద్యార్థి విభాగాల నాయకులతో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని అన్నారు. తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత కేసిఆర్ దని, సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని రవి పిలుపునిచ్చారు. సంక్షేమమే ధ్యేయంగా బిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అభివృద్ధి, సంక్షేమ ఉద్యమం తెలంగాణాలో కొనసాగుతుందన్నారు.

- Advertisement -

గతంలో నెర్రెలుబారిన నేలలు, బీడు భూములు కనిపించేవని, ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢ సంకల్పంతో తెలంగాణ భూములు ఈరోజు పచ్చబడ్డాయన్నారు. ఎటు చూసినా పచ్చని పంట పొలాలు దర్శనం ఇస్తున్నాయని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఏడేండ్లలో కేవలం ఆసరా పెన్షన్లకు 48వేల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల మరమత్తుకు 45వేల కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసిందని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా నీళ్లు ఇచ్చేందుకు 48వేల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు.

రైతులకు ఆర్థిక చేయూత అందించేందుకు ఎకరానికి 5వేల రూపాయల చొప్పున ఇప్పటివరకు 50వేల కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలో జమ చేసిన ప్రపంచంలోనే ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం లక్ష కోట్లు ఖర్చు చేసి కేవలం మూడు సంవత్సరాలలో పూర్తి చేసి రైతులకు నీళ్ళు అందించడం జరుగుతుందన్నారు. గతంలో కరెంటు ఎప్పుడు వస్తుందో రాదో తెలియని పరిస్థితి.పరిశ్రమలు పవర్ హాలిడే ప్రకటించిన పరిస్థితి.కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో 24గంటల విద్యుత్ సరఫరా జరుగుతుందన్నారు.

వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా పెళ్ళైన పేదింటి ఆడబిడ్డలకు 1,00,116 ఇచ్చి ఇప్పటి వరకు 8వేల కోట్ల రూపాయలు బిఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. దళిత బంధు పథకం ద్వారా దళితులు ధనవంతులుగా మారేందుకు దళితబంధు పథకం కింద ఒక్కో యూనిట్ కు పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలను ఆదుకునేందుకు 25వందల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసిందని, ఈ విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలో సంక్షేమంలో స్వర్ణయుగం నడుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ విద్యార్థి విభాగం ,సోషల్ మీడియా, యూత్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News