జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో పూడూరు నుండి నర్సింహులపల్లి వరకు పంచాయతీ రాజ్ బి టి రోడ్డు 2 కోట్ల 19 లక్షల రూపాయల నిధులతో మరమ్మత్తులు పనులకు చొప్పదండి శాసనసభ్యులు సుంకె రవిశంకర్ శంకుస్థాపన చేశారు. అనంతరం కొడిమ్యాల, చెప్యాల లలో పల్లె దవాఖాన కొరకు శంఖుస్థాపన చేశారు. అనంతరం నర్సింహులపల్లి లో లక్ష్మి నరసింహ హాస్పిటల్ కరీంనగర్ డా.జొన్నల శ్రీనివాస్ ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం సందర్శించి వైద్యులను శాలువాతో సన్మానించి మారుమూల ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ… స్వరాష్ట్రం లోనే తెలంగాణా కల్వకుంట్ల చంద్రశేఖర రావు ముఖ్యమంత్రి అయ్యాకే మారు మూల పల్లె లోని రోడ్లకు కూడా మహర్ధశ వచ్చిందన్నారు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రతీ పేదవారికి రోగులకు అందుబాటులో ఉండడానికి పల్లె దవాఖాన లు నిర్మిస్తున్నమని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేన్నేని స్వర్ణలత- రాజనర్సింగారావు, జెడ్పిటిసి పునుగొటి ప్రశాంతి- కృష్ణారావు, ఏఎంసి చైర్మన్ కోరండ్ల నరేందర్ రెడ్డి, వైస్ ఎంపిపి పర్లపల్లి ప్రసాద్, సర్పంచ్ లు ఏలేటి మమత,పెద్ది కవిత,బొడ్డు విజయలక్ష్మి,ఏగుర్ల తిరుపతి, ఊట్కూరి శేఖర్ రెడ్డి,చెక్కపెల్లి స్వామిరెడ్డి, బండ రవీందర్ రెడ్డి, సామల లక్ష్మణ్, పార్టీ మండల అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్, ఒల్లాల లింగా గౌడ్, అంకం రాజేశం, బండపెల్లి అంజన్ కుమార్, బండి లింగా రెడ్డి,అనుమాండ్ల అజయ్ రెడ్డి,నాయకులు కొత్తూరి స్వామి, చీకట్ల మహేష్,రాజ్ పాల్,రమేష్ గౌడ్, నేరెల్ల మహేష్,పర్లపల్లి ప్రభుదాస్, మహంకాళి గంగరాజం, యశ్వంత్, మాణిక్యం శేఖర్,రొడ్డఅంజయ్య, మల్లేశం,అశీం,తదితర నాయకులు పంచాయతీ రాజ్ అధికారులు, వైద్య బృందం,ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.