Friday, September 20, 2024
HomeతెలంగాణSunke Ravishankar: స్థానిక బిడ్డను, అభివృద్ధి చేసినా.. ఆశీర్వదించండి

Sunke Ravishankar: స్థానిక బిడ్డను, అభివృద్ధి చేసినా.. ఆశీర్వదించండి

చొప్పదండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్

రామడుగు మండలం తిర్మలాపూర్, శ్రీరాములపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ….స్థానిక బిడ్డనైన నన్ను ఆశీర్వదించాలని కోరారు.

- Advertisement -

నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నానని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. గతంలో స్థానికేతరులు ఎమ్మెల్యేలుగా గెలిచి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారని, ఎన్నికల ముందు వచ్చి తర్వాత వెళ్లిపోయే నాయకులకు ఈ ప్రాంతం మీద మమకారం ఉండదని పార్టీలకు అతీతంగా నేను అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందజేస్తున్నాని అన్నారు. అందరికీ అందుబాటులో ఉంటున్న.ఏ ఆపద వచ్చినా నేను అండగా నిలుస్తానని అన్నారు.

60 ఏండ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదని అన్నారు.ప్రపంచంలోనే అతి పెద్ద హనుమాన్ దేవాలయం కొండగట్టులో రూపుదిద్దబోతుందన్నారు.

తెలంగాణలో నవంబర్ ముప్పై తారీఖున జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో రాష్ట్ర ప్రజల ఆశలకు అనుగుణంగా ఉంది. అన్ని వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేలా ఉందన్నారు.

తెల్లరేషన్ కార్డున్న ప్రతి పేదింటికి కేసీఆర్ బీమా పథకం కింద రూ.5లక్షలు బీమా ఇవ్వడం..ప్రతి కుటుంబానికి సన్నబియ్యం పంపిణీ చేస్తామనడం,ప్రతి పేదింటి మహిళకు రూ.400లకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం పేదల పట్ల మహిళల పట్ల బీఆర్ఎస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. ప్రస్తుతం ఉన్న ఆసరాను రూ.5వేలకు,దివ్యాంగులకు రూ.6వేలకు పెంచడం అభాగ్యులకు ఆర్థిక భరోసానివ్వడమే అని అన్నారు.

దేశానికి అన్నం పెట్టే రైతన్నకు పంటపెట్టుబడి సాయాన్ని రూ.16వేలకు పెంచడం కూడా మరోకసారి రైతాంగం పట్ల బీఆర్ఎస్ పార్టీకి ఉన్న శ్రద్ధకు ఉదాహరణ అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News