Sunday, July 14, 2024
Homeచిత్ర ప్రభRIP Chandramohan: Chandramohan @ 55 ఇయర్స్ ఇండస్ట్రీ, 932 సినిమాలు

RIP Chandramohan: Chandramohan @ 55 ఇయర్స్ ఇండస్ట్రీ, 932 సినిమాలు

సోమవారం చంద్రమోహన్ అంత్యక్రియలు

ఏమాత్రం పరిచయం అక్కర్లేని అలనాటి హీరో చంద్రమోహన్ ఈ ఉదయం మరణించారు. గత కొంతకాలంగా ఆయన వయసు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. చంద్రమోహన్ అంత్యక్రియలు సోమవారం జరుగనున్నాయి. కే విశ్వనాథ్, బాలసుబ్రమణ్యం, చంద్రమోహన్, శివలెంక కృష్ణప్రసాద్ అందరూ సమీపే బంధువులే కావటం విశేషం.

- Advertisement -

చంద్రమోహన్ సతీమణి జలంధర ప్రముఖ రచయిత్రి కూడా. టాలీవుడ్ తోపాటు పలువురు రాజకీయ ప్రముఖ సంతాపం వెల్లడిస్తున్నారు. సినీ నటుడు తెలుగు వెండి తెర తొలితరం కథా నాయకుడు చంద్రమోహన్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం తెలిపారు.

విభిన్నమైన పాత్రలతో, విలక్షణమైన నటనతో, దశాబ్దాలుగా కోట్లాదిమంది ప్రేక్షకులను అలరించిన చంద్రమోహన్ మరణం, తెలుగు చిత్ర సీమకు తీరనిలోటని సీఎం విచారం వ్యక్తం చేశారు.

వారి స్పూర్తితో ఎందరో నటీ నటులు ఉన్నత స్థాయికి ఎదిగారని, కళామతల్లి ముద్దుబిడ్డగా తెలుగుతో పాటు పలు భాషల్లో లక్షలాదిమంది అభిమానాన్ని చంద్రమోహన్ సొంతం చేసుకున్నారని సీఎం తెలిపారు. 55 ఇయర్స్ ఇండస్ట్రీ, 932 సినిమాల్లో నటించిన చంద్రమోహన్ ఇండస్ట్రీలో లాంగెస్ట్ కెరీర్ కొనసాగించిన అరుదైన వ్యక్తుల్లో ఒకరు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News