Friday, November 22, 2024
HomeతెలంగాణSunke Ravishankar: అవ్వా, నీకు నేనున్నా అధైర్య పడవద్దు

Sunke Ravishankar: అవ్వా, నీకు నేనున్నా అధైర్య పడవద్దు

పూడూరు గ్రామానికి చెందిన పెద్ది నర్సవ్వ.. భర్త మల్లయ్య గత 4 సంవత్సరాల క్రితం మృతిచెందగా వితంతు పెన్షన్ కొరకు దరఖాస్తు చేసుకోగా ఏదో కారణం చేత పెన్షన్ రాకపోవడంతో కీ శే అనుమాండ్ల రాఘవరెడ్డి స్మారక వైద్య శిబిరం ప్రారంభించడానికి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ రాగా అక్కడికి వచ్చిన పెద్ది నర్సవ్వ ఎమ్మెల్యేకు తన పరిస్థితిని వివరించి నాకు వితంతు పెన్షన్ రావడం లేదని అనగానే..‌.వెంటనే స్పందించిన ఎమ్మెల్యే..అవ్వా..నీకు.నేనున్నాను….రంది పెట్టుకోకని కలెక్టర్ తో మాట్లాడి నర్సవ్వకు పెన్షన్ మంజూరు చేయాలని తెలపగానే కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయగా వచ్చేనెల నుండీ‌ పెన్షన్ మంజూరు అయ్యేందుకు అప్రూవల్ వచ్చేలా చేసిన ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ కు కృతజ్ఞతలు తెలిపిన నర్సవ్వ. ఇలాంటి ఎమ్మెల్యే ఉండటం మన అదృష్టం అని అక్కడున్న మహిళలు, స్థానికులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు అనుకుంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News