తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అరెస్టు చేయడం హేయమైన చర్య అని టిడిపి జిల్లా ఇన్చార్జ్, నియోజకవర్గ బాధ్యులు నాతాల రామ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్ వద్ద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసి, అనంతరం మీడియాతో మాట్లాడారు. 40 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు అని అలాంటి వ్యక్తిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి కావాలని కక్షపూరితంగా కేసులు పెట్టడం ఎంతవరకు న్యాయమని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పులివెందుల రాజకీయాలను ఆంధ్రప్రదేశ్ మొత్తం పూస్తున్నాడని ఇలాంటి చర్యలకు పాల్పడి జుగుప్సాకర ఆనందం పొందుతున్నారని త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. వాజ్పాయ్ మొదలుకొని నరేంద్ర మోడీ వరకు అంతటి సమకాలీన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అంతటి గొప్ప వ్యక్తిని అరెస్టు చేయటం మంచిపద్ధతి కాదని అన్నారు.
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ జనరల్ సెక్రెటరీ ధరావత్ వెంకన్న, కార్యదర్శి నాగయ్య, పార్లమెంట్ మహిళా కార్యదర్శి కారింగుల సైదమ్మ, పట్టణ అధ్యక్షులు గాజుల వెంకన్న, ఏర్పుల లింగయ్య, వీరాచారి, పట్టణ ప్రధాన కార్యదర్శి బత్తిని సైదులు, పార్లమెంట్ మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమూద్, సూర్యాపేట ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగయ్య, బి హరి, పట్టణ ఉపాధ్యక్షులు నోముల యాదగిరి, పట్టణ కార్యదర్శి నన్నేసాహెబ్ పాల్గొన్నారు.