Thursday, July 4, 2024
HomeతెలంగాణSuryapeta: కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యకు డిమాండ్

Suryapeta: కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యకు డిమాండ్

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుంచీ జరిగిన రెండు ఎన్నికల్లోనూ కేజీ టూ పీజీ ఉచిత విద్య అందిస్తామన్న సీఎం కేసీఆర్ తన వాగ్దానాన్ని తక్షణం అమలు చేయాలంటూ బీసీ హక్కుల సాధన సమితి ఉద్యమం చేపడుతోంది. సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధూళిపాళ ధనుంజయ నాయుడు ఆధ్వర్యంలో ఈమేరకు నేరేడుచర్ల తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థులకు సర్కారు బకాయి పడ్డ రెండు సంవత్సరాల ఫీజు మూడు వేల కోట్ల వరకు పెండింగ్ లో ఉన్నాయని వాటన్నిటినీ తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యా విషయంలో సీఎం కేసీఆర్ చేసిన హామీల అమలుకు డిమాండ్ చేస్తూ తాసిల్దార్ కి వినతి పత్రం సమర్పించింది బీసీ హక్కుల సాధన సమితి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News