Thursday, April 10, 2025
HomeతెలంగాణSuryapeta: సర్వమతాలకు సామూహిక విందు

Suryapeta: సర్వమతాలకు సామూహిక విందు

ఆయుధ, వాహన పూజ చేసిన మంత్రి

విజయదశమి పర్వదినం సందర్బంగా జిల్లా కేంద్ర.లోని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారి నివాసంలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి జగదీష్ రెడ్డి ఉదయం ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ తో కలిసి సంప్రదాయ పద్దతిలో వాహన పూజలు, ఆయుధ పూజలు నిర్వహించారు. మంత్రి జగదీష్ రెడ్డి గారు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం చేకూరాలని వేదం పండితులు ఆశీర్వదించారు.

- Advertisement -

అలాగే మధ్యాహ్నం సర్వమతాలకు సామూహిక విందు ఏర్పాటు చేసి వారితో కలిసి విందు ఆరగించారు. ఉదయం నుంచి అన్ని రంగాల ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో మంత్రి జగదీష్ రెడ్డి నివాసం కిక్కిరిసిపోయింది.

నియోజక వర్గ వ్యాప్తంగా తరలివచ్చిన నాయకులు, అభిమానులు దసరా శుభాకాంక్షలు తెలిపి ఫొటోలు, సెల్ఫీలు దిగి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే విందు అనంతరం సామూహిక ప్రార్ధనలతో హిందూ, ముస్లిమ్, క్రైస్తవ పెద్దలు విజయం చేకూరాలని వారివారి సంప్రదాయ పద్దతిలో ప్రార్థనలు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News