Talasani Srinivas Yadav| తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని కలిశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. తన సోదరుడి కూతురు వివాహానికి తప్పకరావాలని కోరారు. ఈ సందర్బంగా వివాహ ఆహ్వాన పత్రికను సీఎంకు అందజేశారు.
- Advertisement -
ఇదిలా ఉండగా బీఆర్ఎస్ కీలక నేతగా ఉన్న తలసాని.. రేవంత్‌ను కలవడంపై రకరకాల ఊహగానాలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం పెళ్లికి ఆహ్వానించడానికి మాత్రమే కలిశారని చెబుతున్నారు.