Friday, September 20, 2024
HomeతెలంగాణTandur: ఉత్సాహంగా 'తెలంగాణ 2k రన్'

Tandur: ఉత్సాహంగా ‘తెలంగాణ 2k రన్’

తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి జెండా ఊపి తెలంగాణ 2k రన్ ను ప్రారంభించారు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “తెలంగాణ 2k రన్” కార్యక్రమాన్ని తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి విలీయమూన్ గ్రౌండ్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా హాజరైన తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి జెండా ఊపి తెలంగాణ 2k రన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్, ఆర్డీఓ, పట్టణ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్, పట్టణ ప్రధాన కార్యదర్శులు, తాండూరు పట్టణ సీఐ, రూరల్ సీఐ, ఎస్ఐలు, మున్సిపల్ కౌన్సిలర్లు, అధికార ప్రతినిధి, బిఆర్ఎస్ పార్టీ మండల ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News