Friday, September 20, 2024
HomeతెలంగాణTanduru: బీసీల సంక్షేమాన్ని విస్మరించిన కేసీఆర్ ప్రభుత్వం: బీసీ సంఘం

Tanduru: బీసీల సంక్షేమాన్ని విస్మరించిన కేసీఆర్ ప్రభుత్వం: బీసీ సంఘం

వార్షిక బడ్జెట్లో బీసీలకు కేవలం 6,229 కోట్లు కేటాయించి బీసీలకు అన్యాయం చేశారని జాతీయ బీసీ సంఘం కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ కందుకూరి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ గత వార్షిక 2022-23 బడ్జెట్ 2,30,826 కోట్లు పోలిస్తే ఈ బడ్జెట్ 13 శాతం పెరిగినప్పటికీ బీసీల సంక్షేమానికి సరియైన కేటాయింపులు జరగలేదని ఎంబీసీ 12కులాల ఫెడరేషన్లు ప్రత్యేక కేటాయింపులు రాష్ట్ర బడ్జెట్ లో లేకపోవడం ముమ్మాటికి బీసీలను విస్మరించడమే అని పేర్కొన్నారు.

- Advertisement -

బీసీల సంక్షేమానికి అదనపు కేటాయింపులు చేయకపోవడం చాలా బాధాకరమని రాబోయే రోజుల్లో తెలంగాణ ఎన్నికలు వస్తుండడం వల్ల బీసీలంతా ఎంతో ఆశగా చూశారని ముఖ్యంగా యువతకు రుణాల కోసం ప్రత్యేక బిసి బడ్జెట్ ను కేటాయిస్తారని తెలంగాణలో ఉన్న బీసీలు అనుకున్నారు, కానీ బీసీ వర్గాలని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా నిరాశపరిచిందని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News