మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఖంజాపూర్ గేట్ సమీపంలో రాజ్ పుత్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మహారాణా ప్రతాప్ సింగ్ విగ్రహా ఆవిష్కరణ చేశారు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ 40 ఏళ్ల నుండి నాకన్నా ముందు ఉన్నవారు రాజ్ పుత్ సంఘం వాళ్లు విగ్రహ ప్రతిష్టాపన కోసం ప్రయత్నించిన ఎవరూ పట్టించుకోలేదని తాండూర్ లో మహా యోధుడు మహారాణా ప్రతాప్ సింగ్ విగ్రహ ప్రతిష్టాపన చేయాలనేది, అది కూడా నా చేతుల మీదుగా జరగడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు. తాండూర్ వచ్చే వాళ్ళు మొట్టమొదటిగా మహనీయుడి నీ దర్శించుకునే తాండూర్ లో అడుగు పెడతారని అన్నారు. నేను కూడా మహారణా ప్రతాప్ సింగ్ చరిత్రను చదివానని రాజస్థాన్లోని మేవార్ రాజ్యానికి సంబంధించిన, ఆయన చేసిన యుద్ధాలు రాజపుత్లను కలుపుకోకుండా ఒక్కడే యుద్ధం చేయడం అనేది గొప్ప విషయం మరి ఆయన అడుగుజాడల్లోనే శివాజీ కూడా యుద్ధ విద్యలు అవలంబించడం జరిగిందని ఇంతటి మహనీయుడి విగ్రహాన్ని మనం స్థాపించడం గొప్ప విషయమని రాష్ట్రంలోనే చాలా తక్కువ మహారాణ ప్రతాప్ సింగ్ విగ్రహాలు ఉన్నాయని అన్నారు. ఇలాంటి మహానీయుడు విగ్రహం రంగారెడ్డి జిల్లాలోనే మన తాండూర్ లో ఉందని గర్వంగా చెప్పుకోవచ్చు అని అన్నారు. అవకాశం నాకు కల్పించినందుకు భగవంతుడు ఇచ్చిన భాగ్యంగానే భావిస్తాను అన్నారు. మహారణా ప్రతాప్ సింగ్ మహానుడి చరిత్ర పాఠ్యాంశాలలో చేర్చాలని రాజపుత్రుల విజ్ఞప్తిని తప్పకుండా మన గౌరవ విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి దృష్టికి మనమందరం కలిసి తీసుకు వెళ్దామని రాబోయే రోజుల్లో మహారణా ప్రతాప్ సింగ్ చరిత్రను పాఠ్యాంశాలలో చరిత్ర సాధించిన అంశాలను చేర్చేలా నా వంతు కృషి చేస్తానని అన్నారు. నా పూర్తి సహకారం మీకుంటుందని రాజ్పుత్ సంఘానికి ఒక ఎకరం భూమి కేటాయించేటట్టు వీలైనంత తొందరగా అయ్యేటట్టు నా వంతు కృషి నేను చేస్తానని తెలిపారు. ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టిన రాజ్ పుత్ సంఘ అధ్యక్షుడు మహేష్ ఠాకూర్ కి ప్రత్యేక అభినందనలు తెలియజేశార. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్, కౌన్సిలర్ సంగీత ఠాకూర్, కౌన్సిలర్ వెంకన్న గౌడ్, కోకట్ సర్పంచ్, శ్రీనివాస్ చారి, కౌన్సిలర్ విజయ దేవి, రాజ్ పుత్ సంఘం గౌరవ అధ్యక్షులు సుభాష్ సింగ్ ఠాకూర్, అధ్యక్షులు మహేష్ ఠాగూర్, ఉపాధ్యక్షులు సత్యనారాయణ సింగ్,జనరల్ సెక్రెటరీ శివానంద్ ఠాకూర్, మాజీ అధ్యక్షులు సూరజ్ సింగ్ ఠాకూర్, శీతల్ సింగ్, జగన్ సింగ్, రమేష్ సింగ్, రఘువీర్ సింగ్,జీవన్ సింగ్, సంఘ కమిటీ సభ్యులు బాలాజీ సింగ్, ఠాకూర్ దీపక్ సింగ్, రాకేష్ సింగ్, శివాజీ సింగ్, శరత్ సింగ్,,నిఖిల్ అవస్తి, సురేష్, లకన్, సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.