Monday, July 8, 2024
HomeతెలంగాణTanduru: ఘనంగా సేవాలాల్ మహరాజ్ జయంతి

Tanduru: ఘనంగా సేవాలాల్ మహరాజ్ జయంతి

గిరిజనుల ఆరాధ్యదైవం శ్రీసంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ..సేవాలాల్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని, సేవాలాల్ సూచించిన మార్గంలో నడవాలని కోరారు. సంత్ శ్రీ సేవాలాల్ మహారా సామాజిక విప్లవకారుడని, మూఢనమ్మకాలని నమ్మకూడదని ప్రబోధించారని గుర్తు చేశారు. విభిన్నంగా ఉన్న జాతుల్ని అయన ఏకం చేసి ఐక్యతను చాటారని చెప్పారు. గిరిజనులందరూ సన్మార్గంలో నడుస్తూ గిరిజన సంస్కృతిని కాపాడాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News