Phone Tapping Case: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు నోటీసులు జారీ అయ్యాయి. తెలంగాణలోని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇతనికి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ట్యాపింగ్‌లో ఎంతో మంది బాధితులుగా ఉండగా.. ఈయన కూడా వారిలో ఒకరని గుర్తించిన సిట్ అధికారులు.. గురువారం తమ ఎదుట హజరై వాంగ్మూలం ఇవ్వాలని సిట్ అధికారులు ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం విపరీతమైన ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే దీనిపై సిట్ దర్యాప్తు ముమ్మరంగా చేస్తోంది. విచారణ చేస్తున్న కొద్దీ ట్యాపింగ్ బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సిట్ అధికారులు ఇప్పటి వరకు 269 మంది బాధితుల వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు సమాచారం. వారిలో తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీల నేతలు, హైకోర్టు జడ్జ్‌లు, గవర్నర్లు, సినీ, ఫార్మా, మీడియా, ఐటీ ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ట్యాంపింగ్ వ్యవహారంలో దాదాపు 4,200కు పైగా మొబైల్ ఫోన్లు ట్యాప్ చేసినట్టు సిట్ అధికారులు గుర్తించారు.
- Advertisement -
ట్యాపింగ్ వ్యవహారంలో దర్యాప్తు చేస్తోన్న సిట్ అధికారులు తాజాగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.. అలియాస్ చింతపండు నవీన్ ఫోన్ కూడా ట్యాపింగ్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. అయితే విచారణకు హజరై తన వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో రేపు అనగా గురువారం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి వాంగ్మూలం ఇవ్వనున్నారు.