తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) నిరవధిక వాయిదా పడింది. డిసెంబర్ 9న ప్రారంభమైన శాసనసభ శీతాకాల సమావేశాలు తిరిగి ఈనెల 16న ప్రారంభమయ్యాయి. మొత్తం 7 రోజుల పాటు సమావేశాలు కొనసాగాయి. చివరి రోజు రైతు భరోసాపై స్వల్ప వ్యవధి చర్చ ముగిసిన తర్వాత నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad Kumar) ప్రకటించారు. ఈ సమావేశాల్లో సభ మొత్తం 37 గంటల 44 నిమిషాల పాటు సాగినట్లు ఆయన వెల్లడించారు. ఇక మొత్తం 8 బిల్లులకు ఆమోదం లభించినట్లు తెలిపారు.
ఇక బీఆర్ఎస్ సభ్యులు ఇచ్చిన ఫార్ములా ఈ కార్ రేస్ వాయిదా తీర్మానం, బీజేపీ సభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్థిక సహాయం అందించాలని ఇచ్చిన వాయిదా తీర్మానం, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను స్పీకర్ తిరస్కరించారు.