తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly sessions) రేపటికి వాయిదా పడ్డాయి. లగచర్ల రైతుల అరెస్ట్ అంశంపై శాసనసభలో చర్చకు బీఆర్‌ఎస్ సభ్యులు పట్టుబట్టారు. ఈమేరకు ప్లకార్డులు పట్టుకుని నిరసనలు తెలిపారు. దీనిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ (Speaker Gaddam Prasad) ఆగ్రహం వ్యక్తంచేశారు. సభ్యుల ప్లకార్డులు తీసుకురావాలని మార్షల్స్‌కు ఆదేశాలిచ్చారు. ప్లకార్డులు మార్షల్స్‌కు ఇస్తే మాట్లాడే అవకాశమిస్తామని స్పష్టం చేశారు. అయినా కానీ బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేయడంతో మంగళవారం 10 గంటల వరకు సభను వాయిదా వేశారు.
అయితే సమావేశాలు వాయిదా అనంతరం అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ శాసనసభ్యులు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఇది ‘దొంగల రాజ్యం.. దోపిడి రాజ్యం ‘అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంతకుముందు సభలో సర్పంచ్‌ల పెండింగ్ బిల్లుల అంశంపై అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది.