మార్చి 6న తెలంగాణ కేబినెట్(Telangana Cabinet) భేటీ కానుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) అధ్యక్షతలన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమచారం. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించనున్నారు. అలాగే SLBC టన్నెల్ ప్రమాదం, మెట్రో విస్తరణ పనులపై కేబినెట్‌లో చర్చించే అవకాశముంది.
రాష్ట్రంలో రెండో దఫా కులగణన నిర్వహించిన నేపథ్యంలో అందుకు సంబంధించిన గణాంకాలపై మంత్రివర్గం చర్చించనుంది. ఇక కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఎన్నికల కోడ్ కారణంగా పలు జిల్లాల్లో ఆగిపోయింది. మార్చి 3తో ఎన్నికల కోడ్ ముగియనుండటంతో కొత్త రేషన్ కార్డుల పంపిణీపై చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పలు అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.