Congress| తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హైదరబాద్‌లో రియల్ ఎస్టేట్(Hyderabad Real Estate) భారీగా పడిపోయిందంటూ బీఆర్ఎస్(BRS) నేతలు చేస్తున్న ప్రచారంపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ స్పందించింది. వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలను జత చేస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.
“గడచిన ఆరు నెలల్లో…దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో… హైదరాబాద్ నగర స్థిరాస్తి మార్కెట్ బలమైన వృద్ధిని కనబరిచిందని… ప్రముఖ స్థిరాస్తి కన్సల్టెన్సీ అన్ రాక్ ప్రకటించింది. 2023 – 2024 ప్రథమార్ధం (బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయం) తో పోల్చితే 2024 – 25 మొదటి ఆరు నెలల్లో (కాంగ్రెస్ పాలనలో…) ఇళ్ల ధరలు 37 శాతం పెరిగాయని అన్ రాక్ విశ్లేషించింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయిందని బీఆర్ఎస్ కాలకేయులు చేస్తోన్న ప్రచారానికి ఇది చెంప పెట్టు. రాజకీయ ఈర్ష్యతో రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టడం బీఆర్ఎస్ దుర్నీతికి నిదర్శనం” అని పేర్కొంది.