Sunday, November 16, 2025
HomeతెలంగాణTelangana Movie Piracy Team Arrest : దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ ముఠా అరెస్ట్ 

Telangana Movie Piracy Team Arrest : దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ ముఠా అరెస్ట్ 

Telangana Movie Piracy Team Arrest : హైదరాబాద్‌లోని తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ ముఠాను పట్టుకున్నారు. ఈ ముఠా తెలుగు, హిందీ, తమిళ సినిమాలతో పాటు OTT కంటెంట్‌ను పైరసీ చేసి భారీగా నష్టం కలిగించింది. ఆరుగురు కీలక నిందితులను అరెస్టు చేసిన పోలీసులు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డిస్కులు, ఇంటర్నెట్ డివైసులు సహా టెక్ ఎక్విప్‌మెంట్ పట్టుకున్నారు. సినిమా ఇండస్ట్రీకి కోట్ల రూపాయల నష్టం కలిగించిన ఈ ముఠా, దుబాయ్, నెదర్లాండ్స్, మయన్మార్‌లో కార్యకలాపాలు నడుపుతోంది. క్రిప్టో కరెన్సీ రూపంలో చెల్లింపులు, రహస్య రికార్డింగ్ టెక్నిక్స్ వంటి వివరాలు విచారణలో వెలుగులోకి వచ్చాయి.

- Advertisement -

ఈ ముఠా గుర్తింపు ‘హ్యాష్‌ట్యాగ్ సింగిల్’ సినిమా పైరసీపై జూన్ 5న తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) అంటీ-వీడియో పైరసీ సెల్ నుంచి ఫిర్యాదు అందడంతో మొదలైంది. మే 9, 2025న రిలీజ్ అయిన ఈ సినిమా HD వెర్షన్‌లు రిలీజ్ అవ్వకముందే పలు ప్లాట్‌ఫామ్‌లలో అప్‌లోడ్ అయ్యాయి. విచారణలో వనస్థలిపురం, NGOs కాలనీకి చెందిన ఎయిర్ కండిషనర్ టెక్నీషియన్ జనా కిరణ్ కుమార్ (29) మీద సందేహం పడింది. జూలై 3న అతన్ని అరెస్టు చేసిన పోలీసులు, గత 18 నెలల్లో 40కి పైగా తెలుగు సినిమాలు పైరసీ చేసినట్లు తెలిసింది. అతని ఫోన్‌లు పరిశీలిస్తూ ముఠా విస్తృత నెట్‌వర్క్ గుర్తించారు.

కిరణ్‌తో పాటు మరో నిందితుడు ETV విన్ OTT కంటెంట్‌ను పైరసీ చేసి అమ్ముకున్నాడు. ఈ ముఠా రికార్డ్ చేసిన కంటెంట్‌ను ఇతర వెబ్‌సైట్లకు విక్రయిస్తోంది. ఐబొమ్మ వంటి పైరసీ ప్లాట్‌ఫామ్‌లకు OTT కంటెంట్‌ను అమ్ముతూ లక్షలు సంపాదిస్తోంది. థియేటర్‌లలో ప్లే అయ్యే సినిమాల శాటిలైట్ కంటెంట్ ID, పాస్‌వర్డ్‌లను క్రాక్ చేస్తూ పైరసీ చేస్తున్నారు. ఏజెంట్లకు రికార్డింగ్ కెమెరాలు అందజేసి రహస్యంగా రికార్డు చేయడం నేర్పుతున్నారు. తర్వాత వారికి టికెట్లు బుక్ చేసి థియేటర్‌లలో రికార్డింగ్ చేయిస్తారు. చొక్కా జేబులు, పాప్‌కార్న్ డబ్బాలు, కోక్ టిన్‌లలో కెమెరాలు దాచి చిత్రీకరిస్తున్నారు.

ఈ ముఠా ఏజెంట్లకు కమీషన్ క్రిప్టో కరెన్సీ రూపంలో ఇస్తోంది, ఇది ట్రాక్ చేయడం కష్టం. మొత్తం చైన్ క్రిమినల్ బిజినెస్‌లా నడుస్తోంది – ఎడిటింగ్, అప్‌లోడింగ్, మనీ కలెక్షన్ వరకు టెక్-సావీ గ్యాంగ్ చేతుల్లో ఉంది. 2024లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పైరసీ వల్ల రూ. 3700 కోట్ల నష్టం జరిగింది. ఈ అరెస్టుల తర్వాత ఇండస్ట్రీ మరింత జాగ్రత్తలు తీసుకుంటోంది – వెబ్‌సైట్లపై కోర్టు ఆర్డర్లు, సైబర్ పోలీసులతో సహకారం పెంచారు.

ఈ అరెస్టులు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఊరట కలిగించాయి. పోలీసులు మరిన్ని రిలీజ్‌ల ముందు సర్వైలెన్స్ పెంచి, పైరసీ నెట్‌వర్క్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాపీరైట్ యాక్ట్ 1957, సినిమాటోగ్రాఫ్ యాక్ట్ 1952 (2008 అమెండ్‌మెంట్) ప్రకారం పైరసీ చట్టవిరుద్ధం, కఠిన శిక్షలు ఉన్నాయి.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad