Local Body Elections: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ, స్థానాలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎన్నికల ప్రక్రియకు బలమైన పునాదులు పడినట్లు అర్థమవుతోంది.
మొత్తం ఖరారైన స్థానాలు ఇవే:
జడ్పీటీసీ స్థానాలు: 538
ఎంపీటీసీ స్థానాలు: 5,773
మండల పరిషత్తులు (ఎంపీపీలు): 566
జిల్లా పరిషత్తులు (జడ్పీలు): 31
గ్రామ పంచాయతీలు: 12,778
వార్డులు: 1.12 లక్షలు
ఈ ఖరారును దృష్టిలో పెట్టుకొని త్వరలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. కాగా స్థానిక పాలన ప్రజలకు అత్యంత చేరువైన పరిపాలనా వ్యవస్థ. గ్రామస్తుల ప్రాథమిక అవసరాలు, పంచాయతీల అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామీణ స్థాయిలో ప్రజాస్వామ్యం బలోపేతం కావాలంటే పంచాయతీ రాజ్ వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలు గ్రామ పంచాయతీ నుండి జిల్లాపరిషత్తు వరకు ప్రజా ప్రతినిధులను ఎన్నుకునే అవకాశంగా నిలవనున్నాయి.


